YS Avinash Reddy's pressmeet: పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు, వైఎస్ సునీత, బిజెపిలో ఉన్న తెలుగుదేశం నాయకులు గత రెండు సంవత్సరాలగా కుట్రలు చేస్తూ వచ్చారని వైఎస్ అవినాష్ అన్నారు. పులివెందుల ప్రాంతానికి అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు పులివెందులకు అన్ని నిధులు అవసరమా అని అంటున్నారని అన్నారు.
పులివెందులకు తాను ఆదిత్య బిర్లా, అడిదాస్ లాంటి ఇండస్ట్రీలను తీసుకొచ్చానని.. కానీ 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు పులివెందులకు ఏం చేశారని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చి, కెనాల్స్ అన్ని రెడీ చెస్తున్నారని అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఆఖరికి రైతులకు కూడా వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తంచేశారు. కానీ తమ ప్రభుత్వం మాత్రమే కరోనా లాంటి కష్టకాలంలోనూ రైతుల నుంచి అరటి, చీనీ సేకరించి వారికి మద్దతు ధర ఇచ్చామని వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
పైడిపాలెం ప్రాజెక్టు వ్యయం 690 కోట్ల అయితే వైయస్సార్ ఉన్నప్పుడే 650 కోట్లు ఖర్చు పెట్టారని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కేవలం 40 కోట్లు ఖర్చుపెట్టి అంతా తామే చేసినట్లు చెబుతున్నారని అన్నారు. పైడిపాలెంలో మోటార్ల కొనుగోలు నుండి పైప్ లైన్లు నిర్మాణం వరకు ప్రతి ఒక్కటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే పూర్తయ్యాయని అన్నారు.
ఇది కూడా చదవండి : Ambati Rambabu slams Chandrababu, Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను అంటే బాబుకు ఎందుకు కోపం
ఇదిలావుంటే మరోవైపు పులివెందులలో పూల అంగళ్ళ వద్ద బుధవారం చంద్రబాబు నాయుడు సభ నిర్వహించిన నేపథ్యంలో పులివెందుల అపవిత్రం అయిందంటూ వైసిపి కార్యకర్తలు ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్ళతో శుద్ది చేసి తమ నిరసన వ్యక్తంచేశారు. నీళ్ల ట్యాంకర్లో పసుపు నీళ్లు కలిపి పూల అంగళ్ల వద్ద చల్లారు. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాయలసీమకు ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఇవాళ రాయలసీమ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది అని చంద్రబాబును ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి : Chandrababu about liquor brands in AP: ఏం తమ్ముడూ.. మీరు తాగేది ఎలాంటి మద్యమో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి