YS Sharmila: వైఎస్‌ జగన్‌ ఇంట్లోకి వెళ్లి అయినా సరే సజ్జల భార్గవ్‌ను అరెస్ట్‌ చేయాలి

YS Sharmila Demands Arrest For Sajjala Bhargav Reddy: తనపై.. తన కుటుంబంపై అసభ్య పోస్టుల వెనుక సజ్జల భార్గవ్‌ రెడ్డి దాగి ఉన్నాడని.. అతడు జగన్‌ ఇంట్లో దాగి ఉన్నా కూడా అరెస్ట్‌ చేయాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 20, 2024, 04:42 PM IST
YS Sharmila: వైఎస్‌ జగన్‌ ఇంట్లోకి వెళ్లి అయినా సరే సజ్జల భార్గవ్‌ను అరెస్ట్‌ చేయాలి

Sajjala Bhargav Reddy Arrest: సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతుండగా.. వారికి వైఎస్‌ షర్మిల మద్దతు పలికారు. తనతోపాటు తన తల్లి వైఎస్‌ విజయమ్మ, సోదరి వైఎస్‌ సునీతా రెడ్డిపై కూడా అనుచిత పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిల మరోసారి డిమాండ్‌ చేశారు. అనుచిత పోస్టులకు హెడ్‌ అయిన సజ్జల భార్గవ్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయాలని కోరారు. అతడు జగన్‌ ఇంట్లో దాగి ఉన్నా సరే అరెస్ట్‌ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Also Read: Tirumala: కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులతోపాటు తిరుమల దర్శనం రద్దు

 

సోషల్‌ మీడియా పోస్టులపై అరెస్ట్‌లు కొనసాగుతుండగా వాటిపై బుధవారం ఏపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'సోషల్ మీడియా పోస్టులు ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అవినాశ్‌ రెడ్డిని పోలీసులు ఎందుకు విచారించలేదు?' అని ప్రశ్నించారు. 'నన్ను, అమ్మ (విజయమ్మ)ను, సునీత కించపరిచేలా దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు' అని వివరించారు.

Also Read: Anganwadi: ఏపీ ప్రభుత్వం బంపర్‌ బొనాంజా.. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ

 

'సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిపైనే కాదు పెట్టించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. పోస్టులు పెట్టిన వారి వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి ఉన్నాడు. అతడు సోషల్ మీడియా హెడ్ అని తెలుసు. ఎందుకు సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్టు చేయలేదు? అరెస్టు ఎందుకు చేయలేదో పోలీసులు సమాధానం చెప్పాలి' అని వైఎస్‌ షర్మిల నిలదీశారు. 'పోస్టులు చేసేవాళ్లను కాకుండా చేయించే వాళ్లను అరెస్టు చేయాలి' అని డిమాండ్‌ చేశారు.

'ఏ ప్యాలెస్‌లో ఉన్నా సరే అరెస్టు చేయాలి' అంటూ వైఎస్‌ షర్మిల కోరారు. పరోక్షంగా సజ్జల భార్గవ్‌ రెడ్డి వైఎస్‌ జగన్‌ నివాసంలో ఉన్నాడని షర్మిల వ్యాఖ్యానించారు. 'సంఘంలో మహిళలపై చేస్తున్న దాడి ఇది. పెద్ద తలలను పట్టుకోవాలి' అని కోరారు. 'నేను కేసు పెట్టాలి అంటే ఒక పార్టీ అధ్యక్షురాలిగా కొంత రాజకీయ ఆరోపణలు ఉంటాయి. అది రాజకీయ రంగు పులుముకుంటుంది' అని పేర్కొన్నారు. ఇప్పటికైనా  వివేకా హత్య కేసులో పురోగతి ఉంటుందని.. ఇప్పటికైనా సునీత, సౌభాగ్యమ్మకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News