Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులైన ఐఏఎస్ జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్యలకు కీలక పోస్టులను కేటాయించింది. గత ప్రభుత్వంలాగా రీవెంజ్ లకు పాల్పడకుండా హుందాగా ప్రవర్తించింది.
AP Land titling Act: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చుట్టే తిరుగుతోంది. దీనిపై ఏపీలో ప్రతిపక్షాలు మంచిది కాదంటూ దుష్ప్రచారం చేస్తుంటే.. ఈ ముసాయిదా చట్టంపై కేంద్రం వైఖరి ఏమిటన్నది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలకు భూ హక్కులపై లేని పోని సమస్యలు వస్తాయని ప్రతిపక్షాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజంగానే భూములపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందా.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ?
AP Land titling Act: ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవయేతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే భూములు.. ఇంకా అనేక పేర్లతో భూములు ఉన్నాయి. వాటిన్నింటికీ కలిపి 30కి పైగా రికార్డులున్నాయి. ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటి రికార్డులు. ఈ రికార్డుల్లో ఎన్నో పేచిలున్నాయి. అందుకే ఏపీలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెబుతున్నారు.
AP Govt Extended Sankranti Holidays: రాష్ట్రంలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులను పొడగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 18న స్కూల్స్ రీఓపెన్ చేయాల్సి ఉండగా.. మరో మూడు రోజులు సెలవులు పొడగించింది. దీంతో జనవరి 22న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి.
Minimum Wage For Temple Priests: ఏపీ అర్చకులకు కనీస వేతనాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15,625 రూపాయలు కనీస వేతనం అమలుకు సంబంధించి దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా..
Jagananna Aarogya suraksha Scheme Benefits: జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పూర్తిగా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్ చేయబోతున్నామని... ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటినీ, జల్లెడ పట్టి, ఏ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఆ ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు అక్కడే చేసేటట్టుగా, వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందించేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం అని సీఎం జగన్ ప్రకటించారు.
Chandrababu Naidu Arrest in AP Skill Development Scam: అమరావతి: ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడాన్ని తెలుగు దేశం పార్టీ తప్పుపట్టడాన్ని ప్రస్తావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. అవినీతికి పాల్పడిన వారిపై, తప్పు చేసిన వారిపై కేసులు పెట్టడం కక్ష్య సాధింపు చర్యలు కానే కాదు అని అన్నారు.
AP Cabinet Meeting Highlights: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. జీపీఎస్ బిల్లుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రిటైర్ అయిన పిల్లలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని నిర్ణయించింది. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
Pawan kalyan's Janasena Resolutions: చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ వస్తోన్న జనసేన పార్టీ తాజాగా పలు తీర్మానాలు చేసింది. ఈ విషయంలోనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు విషయంలోనూ తామంతా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తామని చెబుతూ ఆ పార్టీ నేతలు రెండు తీర్మానాలను చేశారు.
YSR Kapu Nestham Scheme Money: రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తూ 16వ తేదీ నాడు.. అంటే నేడే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ఏపీ సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.
AP CM YS Jagan to inaugurate 5 medical colleges today: అమరావతి : ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కారు.. అందులో భాగంగానే నేడు 15వ తేదీన 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు స్పష్టంచేసింది.
Pawan Kalyan About Chandrababu Arrest And AP CM YS Jagan : అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కొద్దిసేపటి ముందు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనుమంచిపల్లి దగ్గర మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు..
YSR Rythu Bharosa Scheme Money Credited in Farmers Bank Accounts: ఆ భగవంతుడి దయతో ఈరోజు రెండు మంచి కార్యక్రమాలకు ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నామని... అందులో మొదటిది కౌలురైతులతో పాటు దేవాదాయభూములు సాగుచేసుకుంటున్న కౌలురైతులకు కూడా కలిపి.. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత పెట్టుబడి సాయం అందిస్తున్నాం అని ఏపీ సీఎం జగన్ అన్నారు.
AP CM YS Jaganmohan Reddy Helps Kidney Patient: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. బుధవారం కాకినాడ జిల్లా జగ్గంపేట పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఝాన్సీ రాణి అనే యువతి కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు.
Pawan Kalyan on Alliance With TDP and BJP: తాను పదేళ్ల నుంచి రాజకీయంలో ఉన్నానన్న పవన్ కళ్యాణ్.. అందుకే తాను ముఖ్యమంత్రిగా చెయ్యడానికైనా సంసిద్దంగానే ఉన్నాను అని అన్నారు. వ్యక్తిగతంగా తనని ఎవరైనా తిడతాను అంటే పడతాను అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తనను ఎవరేమన్నా అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తాను అని అన్నారు.
Outsourcing Employees Salaries: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు శాఖలో పనిచేస్తోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులకు జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలో పనిచేసే దాదాపు 27,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఊహించని కానుక అందినట్లయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.