AP Govt News: వరుసగా ఐదో ఏడాది... వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు

YSR Matsyakara Bharosa Scheme News: రాష్ట్రవ్యాప్తంగా సముద్రంలో వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ప్రతీ ఏడాది వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 మధ్య కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2023, 09:51 PM IST
AP Govt News: వరుసగా ఐదో ఏడాది... వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు

YSR Matsyakara Bharosa Scheme News: రాష్ట్రవ్యాప్తంగా సముద్రంలో వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ప్రతీ ఏడాది వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 మధ్య కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. దీనితో పాటు ఓఎన్‌జీసీ సంస్థ పైప్‌ లైన్‌ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న దాదాపు రూ. 108 కోట్ల ఆర్థిక సహాయంతో కలిపి.. మొత్తం రూ. 231 కోట్లను రేపు మంగళవారం బాపట్ల జిల్లా నిజాంపట్నంలో సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. 

తాజాగా అందిస్తున్న ఈ ఆర్థిక సాయంతో కలిపి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుండి ఇప్పటివరకు కేవలం వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద మాత్రమే అందించిన మొత్తం సాయం రూ. 538 కోట్లు, ఏటా రూ. 10 వేల చొప్పున ఈ ఒక్క పథకం ద్వారానే ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 50 వేల లబ్ధి చేకూరింది. సముద్రంపై వేటకు వెళ్లే మత్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి వలసలను నివారించే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ లాండింగ్‌ కేంద్రాల నిర్మాణానికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. మత్య్య ఎగుమతులకు మరింత ఊతమిస్తూ ఈ 4 ఏళ్ళలోనే సుమారు రూ. 16,000 కోట్ల వ్యయంతో 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని.. తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులు జరిపేందుకు మార్గం సుగుమమం కానుంది.

అర్హత, నైపుణ్యం గల మానవ వనరులను తయారు చేసేందుకు తద్వారా మత్సకారులకు మెరుగైన ఫిషింగ్‌ చేసుకునే పరిజ్ఞానం పెరిగేలా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీష్‌ విశ్వవిద్యాలయం, ఆర్బీకేలలో ఫిషరీస్‌ అసిస్టెంట్స్‌ నియామకం.. మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై శిక్షణ ఇస్తున్నట్టు ఏపీ సర్కారు స్పష్టంచేసింది. నాణ్యమైన సీడ్, ఫీడ్‌ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్‌‌ఫుట్స్‌ కూడా ఆర్‌‌బీకేల ద్వారా సరఫరా... మత్స్య సాగుబడి కేంద్రాల ద్వారా ఆక్వా రైతులకు విస్తరణ సేవలు, పంట సలహాలు అందిస్తున్నామని వెల్లడించింది.

ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50 లకే సబ్సిడిపై విద్యుత్‌ సరఫరా, ఆక్వా కల్చర్‌ వ్యాపార కార్యకలాపాల పర్వవేక్షణ, నియంత్రణ, ప్రోత్సాహానికి వీలుగా ఆక్వా కలర్‌ డెవలప్‌‌మెంట్‌ అథారిటీ 2020. ఆంధ్రప్రదేశ్‌ ఫిష్‌ ఫీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) యాక్ట్ 2020 అమలు... ఇన్‌‌పుట్‌ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందించడానికి తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్స్‌ ఏర్పాటు చేసినట్టు ఏపీ సర్కారు ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.

వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చంద్రబాబు నాయుడు హయాంలో 2014 – 15 ఆర్థిక సంవత్సరంలో 12,178 మంది లబ్ధిదారులకు రూ. 2.43 కోట్లు, 2015 – 16 ఆర్థిక సంవత్సరంలో 66,941 మంది లబ్ధిదారులకు 13.39 కోట్లు, 2016 – 17 ఆర్థిక సంవత్సరంలో 68,957 మంది లబ్ధిదారులకు రూ. 27.59 కోట్లు, 2017 – 18 సంవత్సరంలో 73,017 మంది లబ్ధిదారులకు రూ. 29.21 కోట్లు, 2018 – 19 ఆర్థిక సంవత్సరంలో 80,000 మంది లబ్ధిదారులకు రూ. 32 కోట్లు చొప్పున ఆ ఐదేళ్లలో మొత్తం రూ. 104.62 కోట్లు కేటాయించినట్టు ఏపీ సర్కారు వెల్లడించింది.

ఇదిలావుంటే, వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాకా 2019 – 20 ఆర్థిక సంవత్సరంలో 1.02,478 మంది లబ్ధిదారులకు రూ 102.48 కోట్లు వెల్లడించినట్టు స్పష్టంచేసింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు చెల్లించిన నిషేధ బృతి మొత్తాన్ని తమ సర్కారు తొలి ఏడాదే చెల్లించింది అని ఏపీ సీఎం జగన్ తమ తాజా ప్రకటనలో పేర్కొన్నారు. 2020 – 21 ఆర్థిక సంవత్సరంలో 1,09,231 మంది లబ్ధిదారులుకు రూ. 109.23 కోట్లు, 2021 – 22 సంవత్సరంలో 97,619 మంది లబ్ధిదారులకు రూ. 97.62 కోట్లు, 2022 – 23 సంవత్సరంలో 1,05,161 మంది లబ్ధిదారులకు రూ. 105.16 కోట్లు, 2023 – 24 సంవత్సరంలో 1,23,519 మంది లబ్ధిదారులకు రూ. 123.52 కోట్లు చొప్పున మొత్తం రూ. 538.01 కోట్లు మంజూరు చేసినట్టు జగన్ సర్కారు ప్రకటించింది.

Trending News