Ambati Rambabu, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మనసు మారుతోంది.. అంబటి రాంబాబు సెటైర్లు

Ambati Rambabu Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మనసు ఒక్కో పర్యటనకు ఒక్కో రకంగా మారుతోంది అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు అంటే ఏంటో తెలీదు.. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు పనికిరాడు అని అంబటి రాంబాబు తేల్చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2023, 07:43 AM IST
Ambati Rambabu, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మనసు మారుతోంది.. అంబటి రాంబాబు సెటైర్లు

Ambati Rambabu Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మనసు ఒక్కో పర్యటనకు ఒక్కో రకంగా మారుతోంది అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నమ్ముకుని వీర మహిళలు, జన సైనికులు అసెంబ్లీకి వెళ్తారనే వారు అమాయకులు అనుకోవాల్సి ఉంటుందన్న అంబటి రాంబాబు.. సినిమా మోజులో కొంత.. కులతత్వంతో ఇంకొంత పవన్ కళ్యాణ్‌ని నమ్ముకుని యువకులు మోసపోతున్నారు కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ ని ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు అని అన్నారు.

పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్న జన సైనికుల పరిస్థితి ఎలా ఉందంటే.. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది అంటూ మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీ శ్రేణులను ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు అంటే ఏంటో తెలీదు.. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు పనికిరాడు.. అలాంటి పవన్ కళ్యాణ్ ని వెనుక ఉండి నడిపించేది మరెవరో కాదని.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అతడి వెనుక ఉండి ముందుకు నడిపిస్తున్నారని.. చంద్రబాబు నాయుడు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ నడుచుకుంటారని అన్నారు. 

చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు విని పవన్ కళ్యాణ్ ఏదో కాలక్షేపం కోసం వారాహి వాహనం ఎక్కి పిచ్చిపిచ్చి శపదాలు చేస్తున్నారు అని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. చెప్పుల రాజకీయాలు చేస్తుంది మరోవరో కాదు.. పవన్ కళ్యాణ్ అని అన్నారు. పోలవరంలో ఉన్న గైడ్ బండ్ అనేది స్పిల్ వే ప్రవాహాన్ని అడ్డుకునే కట్ట మాత్రమే. అది ఒక పక్కకు కృంగిపోయింది... ప్రస్తుతం తమ బృందం ఆ అంశంపైనే అధ్యయనం చేస్తున్నాం. పరిస్థితిని పరిశీలిస్తున్నాం అని అంబటి రాంబాబు స్పష్టంచేశారు. గైడ్ బండ్ అనేది కేవలం ప్రవాహం కోసమే వేసే అడ్డుకట్ట మాత్రమేనని.. ఆ విషయం తెలియక దానిని కూడా రాజకీయం చేస్తున్నారు అని అన్నారు. జూలై నెలలో ప్రవాహం పొంగుతుంది కాబట్టి అక్కడ మరమ్మతి పనులు పెద్దగా జరగవు అని తెలిపారు.

Trending News