Telangana CMRF Receives Big Donations For Flood Relief: భారీ వర్షాలు, వరదలతో విలవిలలాడిన తెలంగాణకు స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, పలు రంగాల ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు దాతలు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Telangana Donations: భారీ వర్షాలు, వరదలు తెలంగాణలో బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలో విలయం సృష్టించడంతో సామాన్య ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం విరాళాలు ఆహ్వానిస్తోంది.
Telangana Donations: వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాల్సిన అవసరం ఉంది.
Telangana Donations: స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, పలు రంగాల ప్రముఖులతోపాటు సామాన్యులను సహాయం కోసం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
Telangana Donations: సీఎం సహాయనిధికి జీఎంఆర్ గ్రూప్ రూ.2కోట్ల 50 లక్షలు విరాళం ప్రకటించింది. రూ.కోటి విరాళంగా అందించిన కెమిలాయిడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు. ఏఐజీ ఆస్పత్రులు, శ్రీచైతన్య విద్యాసంస్థలు, వర్కో ఫార్మా, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీత రెడ్డి రూ.కోటి చొప్పున విరాళం ప్రకటించారు.
Telangana Donations: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు తెలంగాణ సహాయ నిధికి అందించారు.
Telangana Donations: వరద బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలిచింది. ఫిల్మ్ ఛాంబర్ రూ.25 లక్షలు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ రూ.10 లక్షలు, ఫిల్మ్ ఫెడరేషన్ రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించింది.
Telangana Donations: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఆన్లైన్ బ్యాంకింగ్‌తో, చెక్కుల రూపంలో.. యూపీఐ పేమెంట్ యాప్స్ నుంచి క్యూఆర్ కోడ్‌తో చెల్లించవచ్చు