TPCC President: తలపండిన కాంగ్రెస్‌ నాయకులకు షాక్‌.. పంతం నెగ్గించుకున్న రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Big Shock To Seniors With Mahesh Kumar Become TPCC President: బడా బడా నాయకులు ఉన్నా కూడా జూనియర్‌ నాయకుడికి టీపీసీసీ స్థానాన్ని రేవంత్‌ రెడ్డి తన వర్గానికి ఇప్పించుకుని సీనియర్స్‌కు భారీ షాకిచ్చాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 6, 2024, 05:46 PM IST
TPCC President: తలపండిన కాంగ్రెస్‌ నాయకులకు షాక్‌.. పంతం నెగ్గించుకున్న రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Shock To Seniors: కాంగ్రెస్‌ పుట్టుక నుంచి పార్టీలో ఉన్న సీనియర్‌ నాయకులకు భారీ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ కంచుకోట అయిన ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో బడా నాయకులుగా చలామణీ అవుతున్న వారి పెత్తనం అధిష్టానం ముందు నడవలేదు. వీర ప్రగల్బాలు పలికే నాయకులను కాదని జూనియర్‌ నాయకుడికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కడంతో సీనియర్లకు భంగపాటు ఎదురైంది. తనకు సన్నిహితంగా ఉంటున్న మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు రేవంత్‌ రెడ్డి పదవి ఇప్పించుకుని అధిష్టానం వద్ద తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు.

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం: హరీశ్‌ రావు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌కు చెందిన మహేశ్‌ కుమార్‌ గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. పార్టీకి నిబద్ధత గల వ్యక్తి. ఏ పదవి ఇచ్చిన చేసుకుంటూ వెళ్లే రకం. సౌమ్యుడిగా పేరున్న మహేశ్‌ కుమార్‌ అధికారంలోకి వచ్చాక కొంచెం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించిన అధిష్టానం గతంలోనే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్‌ రెడ్డికి మొదటి నుంచి మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అండగా నిలుస్తున్నారు. రేవంత్‌ నాయకత్వానికి జై కొట్టారు.

Also Read: KCR Donation: వరద బాధితులకు మాజీ సీఎం కేసీఆర్‌ విరాళం.. కేటీఆర్‌, కవితతో సహా అందరూ

శాసన సభ ఎన్నికల్లో.. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ ఆశించినప్పటికీ రేవంత్‌ సూచన మేరకు పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీ ఏ పదవి ఇచ్చినా చేసుకుంటూ వెళ్తూ అందరితో కలివిడి ఉండే నాయకుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసి విఫలమైన మహేశ్‌ కుమార్‌ మొన్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. బలమైన నాయకుడు కాకపోయినా కూడా అధిష్టానం మహేశ్‌ వైపు మొగ్గుచూపింది. ఆ విధంగా రేవంత్‌ చక్రం తిప్పారు. అటు ప్రభుత్వంలోనూ.. ఇటు పార్టీలోనూ మరోసారి తనకు తిరుగులేదని రేవంత్ నిరూపిస్తున్నాడు.

సీనియర్స్‌కు భంగపాటు
కాంగ్రెస్‌ పార్టీలో అగ్ర నాయకులు చాలా మంది ఉన్నారు. మహేశ్‌ కుమార్‌ కన్నా సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. వీ హనుమంత రావు మొదలుకుని మధుయాష్కీ గౌడ్‌ వరకు ఉన్నారు. దీనికితోడు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి పార్టీ బడా లీడర్లు ఉన్నారు. వారి వర్గం బలంగా ఉంది. నల్లగొండలో ఉత్తమ్‌ కుమార్‌, జానా రెడ్డి, కోమటి రెడ్డి కుటుంబం, ఖమ్మంలో పొంగులేటి, భట్టి, తుమ్మల ఇలా బడా బడా నాయకులు ఉన్నారు. కానీ వారు అధిష్టానం ముందు మాత్రం తమ బలాన్ని చూపించడంలో విఫలమవుతున్నారు.

మధుయాష్కీకి మొండిచేయి
మధుయాష్కీ గౌడ్‌కు అవకాశం దక్కకపోవడంతో సీనియర్లకు భారీ షాకే తగిలింది. పొంగులేటి, భట్టి వర్గం బలహీనమైంది. పార్టీలోనూ.. అధికారంలోనూ రేవంత్‌ హవా కొనసాగిస్తున్నారు. తాజాగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు టీపీసీసీగా పదవి ఇప్పించి అధిష్టానం వద్ద రేవంత్‌ తన మాటను నెగ్గించుకున్నాడు. సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా రేవంత్‌ మాటకు అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుందని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నియామకం ఉదాహరణగా నిలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News