Jalakantha Lucky Stone: ఒక చిన్న ఎర్రటి స్టోన్లో చిన్న లైట్ అమర్చి.. దానినే లక్కీ స్టోన్ జలకంతా అని నమ్మించే ప్రయత్నం చేశారు. జలకాంతకు అద్భుత శక్తులు ఉన్నాయని.. ఇది ఎవరి దగ్గర ఉంటే వారిని అదృష్టం వరిస్తుందని నమ్మించబోయారు. మార్కెట్లో దీని విలువ 2 కోట్ల రూపాయిలు పలుకుతుంది అని చెప్పి జనాన్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నంలో ఉండగానే సీన్ మధ్యలోకి ఎస్ఓటి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
Hyderabad Police Alert: సంక్రాంతిని కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకునేందుకు సిటీ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. ఈ తరుణంలోనే అదును చూసి ఇళ్లను గుళ్ల చేసేందుకు దొంగలు రెడీ అవుతున్నారు. సంక్రాంతికి ఉరెళ్లుందుకు రెడీ అవుతున్న వారికి హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
Chain Snatching Gang: హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. హర్యానా బవేరియా గ్యాంగ్ సభ్యులుగా గుర్తించిన పోలీసులు.. ఎంజీబీఎస్ నుంచి బస్సు ఎక్కి పరార్ అయినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి ఆధారం లభించలేదు.
Serial Chain Snatching Case Updates: హైదరాబాద్ వాసులను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు జంట నగరాల్లో దాదాపు రెండు గంటల వ్యవధిలోనే 6 చోట్ల మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు.
Rachakonda CP Mahesh Bhagawath: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగలు పంజా విసిరారు. సుమారు 22 కోట్ల 42 లక్షలు సొమ్మును దొంగిలించారు. ఇందులో పోలీసులు 14 కోట్లు వరకు రికవరీ చేశారు. ఈ సంవత్సరం కమిషనరేట్ పరిధిలో పలు సంచలన కేసులు నమోదయ్యాయి.
Ys Sharmila Hunger Strike: తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని.. అరెస్ట్ చేసిన పార్టీ కార్యకర్తలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల చేపట్టిన నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం అర్ధరాత్రి లోటస్‌పాండ్ వద్ద హైడ్రామా నడుమ ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు.
Nanda Kumar Bail: నంద కుమార్‌ఫై ఇందిర కోన అనే మరో మహిళ ఫిర్యాదు చేశారని.. ఆమే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నందున ఆ కేసులో నంద కుమార్‌పై పిటి వారెంట్ కావాలని బంజారాహిల్స్ పోలీసులు కోర్టును కోరారు.
BJP MLA Raja Singh released: ఎమ్మెల్యే రాజా సింగ్ జైలు నుంచి విడుదలై బయటికొచ్చారు. ప్రొఫెట్ మహ్మద్‌ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన తర్వాత 76 రోజులకు రాజా సింగ్ విడుదలయ్యారు.
డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కింగ్ పిన్ అరెస్టు ద్వారా కేసు కొత్త మలుపు తిరగనుంది. మాదక ద్రవ్యాల కేసులో ఇది కీలమకైన పరిణామంగా చెబుతున్నారు.
Cash Seized ahead of Munugode Bypolls: నార్సింగి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు.. మూడు వాహనాల్లో కోటి రూపాయలు తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నార్సింగిలో దొరికిన డబ్బులకు మునుగోడు ఉప ఎన్నిలకు సంబంధం ఉందా ?
Hyderabad: మాజీ ఇన్స్పెక్టర్ కోరట్ల నాగేశ్వర రావుకు సంబంధించిన కేసులో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో 600 పేజీల సమగ్ర ఛార్జిషీటు దాఖలు చేశారు పోలీసులు. ఇందులో భాగంగా అత్యా చారం చేశాడని నిరూపించే బలమైన ఆధారాలు, సాక్ష్యాలను విచారణాధికారి ఛార్జిషీటులో పేర్కొన్నారు.
Panjagutta Traffic ACP Gyanendar Reddy: గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి అవయవాల తరలింపులో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేందర్ రెడ్డిని జీ తెలుగు న్యూస్ ఘనంగా హెల్త్ కాన్క్లేవ్ అవార్డు సత్కరించింది.
Amit shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో కలకలం రేగింది. ఆయన భద్రతలో మరోసారి సెక్యూరిటీ వైఫల్యం బయటపడింది. అమిత్ షా కాన్వాయ్ వెళుతుండగా.. మరో కారు అడ్డుగా వచ్చింది.
Man killed Pregnant Woman: చెల్లెలి కాపురం సరిదిద్దాలని ఓ అన్న చేసిన ప్రయత్నం అతడిని తన బావ దృష్టిలో శత్రువును చేసింది. మరోవైపు బావమరిదిపై కోపంతో అతడి ఇంటికి వెళ్లిన బావకు ఆ సమయంలో బావమరిదికి బదులు అతడి భార్య కనిపించింది.
Hyderabad Police: పోలీస్ శాఖలో అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు. లంచలం ఇవ్వనిదే అక్కడే పని కాదంటారు. కాని ఇతర శాఖల్లో మాదిరిగా పోలీసు శాఖలో ఏసీబీ అధికారులు చాలా తక్కువ. కాని కొంత కాలంగా పోలీసు అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు.
Hyderabad Traffic Junctions: హైదరాబాద్ : రోడ్లపై ప్రమాదాలు నివారించి, ట్రాఫిక్ జామ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. జిహెచ్ఎంసి పరిధిలోని జోన్ 2 చొప్పున ఆరు జోన్లలో 12 ట్రాఫిక్ జంక్షన్లను ప్రయోగాత్మకంగా అభివృద్ధిపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
Hyderabad old city Lathi Charge: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పాతబస్తీలో పోలీసుల ఆంక్షలు అమలు అవుతున్నప్పటికీ.. కొంతమంది యువత ఒక్క చోట చేరి రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం చేస్తూ ఆందోళనకు దిగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.