Holidays in Telangana Due to Heavy Rains: హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా బారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పౌరులు, చిన్నారుల భద్రత దృష్ట్యా తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో గత మూడు, నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరం నలుమూలల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
Hyderabad Cop SI Gaddam Mallesh About Heavy Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీసులు సైతం పలు అంశాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ పోలీసు విభాగానికి చెందిన ఎస్ఐ గడ్డం మల్లేష్ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక వీడియోను రూపొందించారు.
Suicide By Cutting off His Penis: సాధారణంగా ఆత్మహత్యకు పాల్పడే ఏ వ్యక్తి అయినా తనని తాను అతి కిరాతకంగా హింసించుకునే ధైర్యం చేయలేరు. చస్తూ చస్తూ చచ్చే ముందు శారీరకంగా, మానసింగా కలిగే ఆ నొప్పిని ఎవ్వరూ భరించలేరు. అయినప్పటికీ ఈ ఘటనలో యువకుడు తన పురుషాంగాన్ని కోసుకుని మరీ ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
Man Kills Wife: అసలు ఏం జరిగింది అంటే.. మే 20న రాత్రి వేళ శ్రావణితో ( పేరు మార్చడం జరిగింది ) ఆమె భర్త సెక్స్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, అప్పటికే ఆమె తన రెండో కాన్పులో డెలివరి అయి నెల రోజులే అవుతోంది.
Jewellery Shop Robbery: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26 మూవీతో పాటు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన గ్యాంగ్ సినిమాలను మీరూ చూసే ఉండి ఉంటారు కదా... ఆ రెండు చిత్రాల్లో కథనం ఒక్కటే. జువెలరీ షాపులు, బడా బాబుల ఇళ్లలో ఫేక్ ఐడి దాడులు చేసి అందినకాడికి దోచుకుపోవడమే ఈ సినిమాల స్టోరీ. తాజాగా హైదరాబాద్‌లో ఆ స్టోరీని ఇంప్లిమెంట్ చేసిన దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Thief Booked Cab to Escape: ఇదొక వెరైటీ చోరీ కేసు... సినీ ఫక్కీలో రెక్కీ నిర్వహించి మరీ చోరీకి వచ్చిన దొంగ.. యజమాని కుటుంబసభ్యులను బెదిరిస్తూ రాత్రంతా ఆ ఇంట్లోనే గడిపాడు. తెల్లవారే సమయానికి ఇంట్లో వారి చేతే క్యాబ్ బుక్ చేయించుకుని రూ. 10 లక్షల నగదుతో పరారయ్యాడు. ఇంతకీ పోలీసులకు ఎలా చిక్కాడంటే...
CP Stephen Ravindra Launches CDEW: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అల్వాల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నూతనంగా ఏర్పాటు చేసిన CDEW (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ) కౌన్సిలింగ్ కేంద్రాలను ఈరోజు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు.
TSPSC Paper Leakage Case News: టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన లీక్ వీరులు మొదటి ర్యాంకు సాధించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. పేపర్ లీకేజీ చేసి డివిజనల్ అకౌంట్స్ అఫీసర్.. డీఏవో పరీక్ష రాసిన ముగ్గురు టాపర్లుగా నిలిచారని తేలింది.
Telangana Youth Congress: బంజారాహిల్స్‌లో యువజన కాంగ్రెస్ విభాగం నిర్వహిస్తున్న సోషల్ మీడియా వార్ రూమ్ కార్యాలయంలో సైబరాబాద్ పోలీసులు సోదాలు చేపట్టారు. సైబరాబాద్ పోలీసులు ఈ ఆకస్మిక తనిఖీల అనంతరం విలువైన డేటాతోపాటు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
Fake Currency Notes Printing is a Crime: డబ్బు సంపాదించాలంటే చదువు అవసరం లేదు. టెక్నాలజీ పరిజ్ఙానం ఉంటే చాలు. నకిలీ డబ్బులనే తయారు చేయవచ్చు అని నిరుపించాడు రంజిత్ సింగ్.. డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం... అదే నకిలీ డబ్బులను తయారు చేయడం చాలా ఈజీ అనుకున్నాడు.
Man Attacked At Kerala Story Screening Theatre: పోలీసుల దాష్టికం అంతటితో ఆగలేదని.. రాత్రి 11.30 గంటల సమయంలో తనను సీఐ రామ లక్ష్మణ్ రాజు సిబ్బందితో కలిసి పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ కూడా బట్టలూడదీసి లాకప్ లో కూర్చొబెట్టారని.. ఏ తప్పు చేయని తనని ఎందుకు పోలీసు స్టేషన్ కి తీసుకొచ్చారని ప్రశ్నించగా.. తమకు సహకరించకుండా ఎక్కువ చేస్తే గంజాయి కేసులో ఇరికించి లోపల వేస్తామని బెదిరించారని హితేష్ పేర్కొన్నాడు.
Terrorists Training at Ananthagiri Hills: భాగ్య నగరంలో ఉగ్రవాదుల కలకలం.. భయపడిపోతున్న నగర వాసులు... బయటపడిన ఉగ్రవాదుల లింకులు... లింకుల్లో ఆరుగురు అరెస్ట్... ఉగ్రవాదులు వేసిన స్కేచ్ ఏంటీ.. వేసిన ప్లానింగ్ అమలు చేసేందుకు ఎవరు రంగంలోకి దిగబోతున్నారు... నగరంలో ఏం జరగబోతుంది... ఉగ్రవాదులు ఏం మారణహోమం సృష్టించబోతున్నారు... ఇంకా కొనసాగుతున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ఏం చెబుతోంది ?
Terror Suspects Arrested in Hyderabad: హైదరాబాద్‌లో ఉంటూ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానాల కింద మధ్యప్రదేశ్ యాంటీ - టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు, తెలంగాణ ఇంటెలీజెన్స్ పోలీసులు మంగళవారం అటు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇటు హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు జరిపారు.
Drugs Supply Plot Busted by Hyderabad Cops: హైదరాబాద్ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోందా ? వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. నిషేధిత డ్రగ్స్‌ని అక్రమ రవాణా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అంతకు మించిన రేంజులోనే ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు డ్రగ్స్ దందాగాళ్లు.
AE Exams 2023 Cancelled: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నపత్రాల లీక్ ఉదంతంలో రోజుకొక కొత్త ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మలుపులతో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. ఈ కేసుతో నేరుగా సంబంధం ఉన్న ప్రవీణ్, రేణుకతో పాటు టిఎస్పీఎస్సీలో ఇంకొంతమంది అధికారులను ప్రశ్నిస్తోంది.
Ambulance Driver Caught Drinking Alcohol : అంబులెన్స్ డ్రైవర్.. ఎంత దూరమైనా.. ఎంత రాత్రయినా.. జోరున కురిసే వర్షమైనా.. అత్యవసర పరిస్థితుల్లో ఎదుటి వారి ప్రాణాలను రక్షించేందుకు దేన్నీ లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందించే గొప్ప గుణం అంబులెన్స్ డ్రైవర్ల సొంతం.
Constable Died in Gym: జిమ్‌లో పుషప్స్, స్ట్రెచెస్ చేసిన వెంటనే విశాల్‌కి విపరీతమైన దగ్గు రావడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా అవస్థ పడ్డాడు. చుట్టూ ఉన్న వారు వచ్చేలోపే విశాల్ అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి మిత్రులు విశాల్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
PD Act Filed on Naveen Reddy: వైశాలి కిడ్నాప్ కేసులో డిసెంబర్ 10న నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై అధిబట్ల పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు అడ్డం వచ్చిన ఆమె కుటుంబసభ్యులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన నేరం కింద నవీన్ రెడ్డితో పాటు అతడి వెంట వెళ్లిన మరో 40 మందిపై ఆధిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.