Jalakantha Lucky Stone: లక్కీ స్టోన్ జలకాంత అని చెప్పి రూ. 2 కోట్లకు ఉత్తి రాయిని అమ్మబోయారు

Jalakantha Lucky Stone: ఒక చిన్న ఎర్రటి స్టోన్‌లో చిన్న లైట్ అమర్చి.. దానినే లక్కీ స్టోన్ జలకంతా అని నమ్మించే ప్రయత్నం చేశారు. జలకాంతకు అద్భుత శక్తులు ఉన్నాయని.. ఇది ఎవరి దగ్గర ఉంటే వారిని అదృష్టం వరిస్తుందని నమ్మించబోయారు. మార్కెట్‌లో దీని విలువ  2 కోట్ల రూపాయిలు పలుకుతుంది అని చెప్పి జనాన్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నంలో ఉండగానే సీన్ మధ్యలోకి ఎస్ఓటి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

Written by - Pavan | Last Updated : Feb 10, 2023, 04:55 AM IST
Jalakantha Lucky Stone: లక్కీ స్టోన్ జలకాంత అని చెప్పి రూ. 2 కోట్లకు ఉత్తి రాయిని అమ్మబోయారు

Jalakantha Lucky Stone: అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే యావ వారిని జైలుపాలయ్యేలా చేసింది. ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు ఉత్తుత్తి రాయిని లక్కీ స్టోన్ జలకాంత అని జనాన్ని నమ్మించి, దానిని రూ. 2 కోట్లకు విక్రయించే ప్రయత్నం చేస్తుండగా మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గురువారం కాప్రా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

లక్కీ స్టోన్స్ తమ వద్ద ఉంటే అదృష్టం వరించి, భారీగా ధనం కలిసొస్తుందని ఆశపడే జనాన్ని మోసం చేసి చిటికెలో రూ. 2 కోట్లు కొట్టేయాలని చూసిన మోసగాళ్లను ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి కూషాయిగూడ పోలీసులకు అప్పగించారు. 

ఒక చిన్న ఎర్రటి స్టోన్‌లో చిన్న లైట్ అమర్చి.. దానినే లక్కీ స్టోన్ జలకంతా అని నమ్మించే ప్రయత్నం చేశారు. జలకాంతకు అద్భుత శక్తులు ఉన్నాయని.. ఇది ఎవరి దగ్గర ఉంటే వారిని అదృష్టం వరిస్తుందని నమ్మించబోయారు. మార్కెట్‌లో దీని విలువ  2 కోట్ల రూపాయిలు పలుకుతుంది అని చెప్పి జనాన్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నంలో ఉండగానే సీన్ మధ్యలోకి ఎస్ఓటి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరు నిందితుల ఫేక్ లక్కీ స్టోన్ గురించి స్పష్టమైన సమాచారం అందుకున్న పోలీసులు.. చాకచక్యంగా వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని కాజీపేటకు చెందిన బల్సుగురి చందుగా, మరొకరిని హైదరాబాద్ అల్వాల్ కి చెందిన మేడికొండ సాంభశివ రావుగా గుర్తించారు.

నిందితుల నుంచి జలకాంతగా చెబుతున్న ఫేక్ లక్కీ స్టోన్, 3 మొబైల్ ఫోన్లు, ఒక మారుతీ ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూషాయిగూడ పోలీసులు.. నిందితులు ఇలా ఇంతకు ముందు ఎవరెవరిని, ఏయే విధంగా మోసం చేశారనే వివరాలు రాబడుతున్నారు. లక్కీ స్టోన్స్ తమ వద్ద ఉంటేనో లేక రంగు రాళ్ల ఉంగరాలు ధరిస్తేనో భారీగా అదృష్టం కలిసొస్తుందని నమ్మే అమాయకులనే లక్ష్యంగా చేసుకుని ఇటువంటి ముఠాలు మోసాలకు తెరతీస్తుంటాయనే నేర వార్తలు మనం గతంలోనూ ఎన్నో సందర్భాలు చూసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి : Adultery for Job Scam: మంచి ఉద్యోగం ఇప్పిస్తానని అమ్మాయిలను పిలిచి..

ఇది కూడా చదవండి : Husband and Wife Real Crime Story : ఈ భర్త నాకు వద్దనుకుంది.. మరొక జంటతో కలిసి..

ఇది కూడా చదవండి : Husband And Wife Matters: పెళ్లాం ఊరెళ్లి తిరిగి రావడం లేదనే కోపంతో తన పురుషాంగాన్ని తనే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Trending News