హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ), 14.5 కిలోమీటర్ల నెక్లెస్ రోడ్ పరిధి చుట్టూ ప్రక్కల 240 హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, నిరంతరం అప్రమత్తం కొరకు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులపై
శంషాబాద్ ఎయిర్ పోర్టులోని అమెజాన్ కంపనీలో పనిచేస్తూ కస్టమర్ల ఆర్డర్లకు సంబంధించిన సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలను మాయం చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యమని, చట్టాలను ఉల్లంఘించిన వారికి శిక్షలు పడుతున్నాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తప్పు చేసినా వారికి శిక్షలు పడే విదంగా పోలీసులు నమ్మకం కల్పించాలని, నేరం చేసిన వారిని గుర్తించాలని, కేసులను త్వరగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
తనకు గతంలో అన్యాయం చేసిన ఐఏఎస్ అధికారిపై ఓ మహిళ ఫిర్యాదు చేయగా, ఆయనను కాపాడేందుకు కొందరు పోలీసు ఉన్నతాధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ దినేష్ రెడ్డిపై కేసు నమోదైంది.
పౌరసత్వ సవరణ చట్టం 2019, జాతీయ పౌర పట్టికలను వ్యతిరేకిస్తూ ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్‌లో ప్రజాస్వామ్య వాదులు, మైనార్టీలు ఆందోళన చేపట్టారు. మైనార్టీలను వేధింపులకు గురిచేసేలా ఉన్న పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ జెండాలతో వేలాది మంది పౌరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
షేక్‌పేట్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం ఓ కారులో పెట్రోల్ నింపుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఉత్తమ పోలీస్ సేవా పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ డిపార్ట్మెంట్(విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి ప్రభుత్వం ఈ పతకాలను ప్రకటించింది.
నూతన సంవత్సర 2020 వేడుకల సందర్భంగా రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు హైదరాబాద్ ప్రతి పొలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, నగర కమిషనర్ అంజనీకుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఘాటుగా స్పందించారు. మంత్రి తలసాని శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ 'దేశాన్ని రక్షించుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం' నినాదంతో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్‌పైనున్న అంబేద్కర్ విగ్రహం వరకు శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాల సంఖ్య అధికమయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే సకల నేరాలు అన్నింటికి కూడా కారణభూతమైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కూడా కష్టతరమవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
జాతీయ మానవహక్కుల సంఘం పంపించిన నిజ నిర్ధారణ కమిటి సభ్యులు చటాన్‌పల్లికి చేరుకుని ఎన్కౌంటర్ జరిగిన ఘటనాస్థలిని పరిశీలించారు. తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటి సభ్యుల బృందం.. ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించింది.
షాద్‌నగర్‌కి సమీపంలోని చటాన్‌పల్లి కల్వర్టు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
''నా భర్తను ఎక్కడైతే ఎన్కౌంటర్ చేశారో.. నన్ను కూడా అక్కడికే తీసుకెళ్లి కాల్చిచంపండి. మా ఇద్దరికీ పెళ్లయి ఏడాదే అవుతోంది. ఇప్పుడు మా ఆయన లేకుండా నేనుండలేను''. దిశ హత్య కేసులో నిందితుడిగా ఉండి శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో హతమైన చింతకుంట చెన్నకేశవులు భార్య రేణుక ఆవేదన ఇది.
దిశపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో ఉన్న నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసుల చర్యను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధినేతగా ఉన్న శివ సేన పార్టీ స్వాగతించింది. ఈ మేరకు శనివారం శివసేనకు చెందిన సామ్నా పత్రికలో ఓ సంపాదకీయ కథనం ప్రచురితమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.