Amit shah: హైదరాబాద్ లో కలకలం.. అమిత్ షాను అడ్డుకునే ప్రయత్నం.. కారు అద్దాలు పగలగొట్టిన ఎస్పీజీ

Amit shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో కలకలం రేగింది. ఆయన భద్రతలో మరోసారి సెక్యూరిటీ వైఫల్యం బయటపడింది. అమిత్ షా కాన్వాయ్ వెళుతుండగా.. మరో కారు అడ్డుగా వచ్చింది.

Written by - Srisailam | Last Updated : Sep 17, 2022, 12:44 PM IST
Amit shah: హైదరాబాద్ లో కలకలం.. అమిత్ షాను అడ్డుకునే ప్రయత్నం.. కారు అద్దాలు పగలగొట్టిన ఎస్పీజీ

Amit shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో కలకలం రేగింది. ఆయన భద్రతలో మరోసారి సెక్యూరిటీ వైఫల్యం బయటపడింది. అమిత్ షా కాన్వాయ్ వెళుతుండగా.. మరో కారు అడ్డుగా వచ్చింది. అమిత్ షా వాహనానికి ఆ కారు సైడ్ ఇవ్వలేదు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీజీ కారు అద్దాలు ధ్వంసం చేసింది. హరిత ప్లాజా దగ్గర జరిగిన ఈ ఘటన తీవ్ర  దుమారం రేపుతోంది. అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఎస్పీ ఆరా తీస్తోంది.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాన్వాయ్ కు అడ్డుగా వచ్చిన కారు టీఆర్ఎస్ నాయకుడిదిగా గుర్తించారు. గోసుల శ్రీనివాస్ యాదవ్ కావాలనే తన కారుతో అమిత్ షాను అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. శ్రీనివాస్ యాదవ్ ను పంజాగుట్ట పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు అమిత్ షా. సభలో ప్రసంగం తర్వాత హరిత ప్లాజాలో జరగనునన్న బీజేపీ నేతల సమావేశానికి వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ నుంచి హరిత ప్లాజాకు వచ్చే దారిలోనే అమిత్ షా కాన్వాయ్‌కి  కారు అడ్డుగా వచ్చింది. ఎంతకు కారు పక్కకు జరగకపోవడంతో అమిత్ షా భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు.  కారు వెనుక అద్దం పగలగొట్టారు. అయితే తన కారు ఇంజిన్ లోపంతో సడెన్ గా ఆగిపోయిందని చెబుతున్నారు కారు యజమాని, టీఆర్ఎస్ గోసుల శ్రీనివాస్. పోలీసులు తన కారును అనవసరంగా ధ్వంసం చేశారని వాపోయారు. ఈ ఘటన హైదరాబాద్ పోలీసులకు చెమటలు పట్టించింది.

Read Also: Hyderabad Liberation day: విలీనమా.. విమోచనమా.. విద్రోహమా? సెప్టెంబర్‌ 17న అసలేం జరిగింది?

Read Also: ao Ramesh Great Heart: పర్సనల్ మేకేప్ మేన్ కుటుంబానికి అండగా రావు రమేష్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News