Munugode Bypolls: సినీ ఫక్కీలో కార్ల చేజింగ్.. కార్లలో లభించిన కోటి రూపాయలు ఆ నేతవేనా ?

Cash Seized ahead of Munugode Bypolls: నార్సింగి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు.. మూడు వాహనాల్లో కోటి రూపాయలు తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నార్సింగిలో దొరికిన డబ్బులకు మునుగోడు ఉప ఎన్నిలకు సంబంధం ఉందా ?

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2022, 12:13 AM IST
Munugode Bypolls: సినీ ఫక్కీలో కార్ల చేజింగ్.. కార్లలో లభించిన కోటి రూపాయలు ఆ నేతవేనా ?

Cash Seized ahead of Munugode Bypolls: హైదరాబాద్ శివార్లలోని నార్సింగి రోటరీ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు తీసుకెళ్తున్న మూడు వాహనాలు తారసపడ్డాయి. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసిన మూడు వాహనాల డ్రైవర్లు.. వారికి చిక్కకుండా ఉన్నట్టుండి వేగం పెంచారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కార్లను చేజ్ చేసి పట్టుకున్నారు. కార్లలో తనిఖీలు చేపట్టగా.. వాటిలో కోటి రూపాయల నగదు లభ్యమైంది. కోకాపేట నుండి నార్సింగి మీదుగా హైదరాబాద్ వెళుతున్నట్టుగా నగదును తరలిస్తున్న వ్యక్తులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో నలుగురు తప్పించుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కోకాపేటలో ఉండే సునీల్ రెడ్డి వద్ద డబ్బులు తీసుకున్న దేవల్ రాజు  అనే వ్యక్తి ఆ డబ్బును హైదరాబాద్ కి తరలించే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. వ్యాపారవేత్త హర్షవర్ధన్ అదేశాల మేరకే దేవల్ రాజు వెళ్లి కోకాపేటలోని లెజెండ్ చిమినీస్ విల్లాలో నివాసం ఉండే సునీల్ రెడ్డి వద్ద నుంచి కోటి రూపాయల నగదు తీసుకున్నట్టు తెలుస్తోంది. 

సులీల్ రెడ్డి ఇచ్చిన కోటి రుపాయల నగదు మొత్తాన్ని మొత్తం మూడు భాగాలుగా చేసి దాచిన దేవల్ రాజు... నార్సింగీ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... కోటి రూపాయల నగదు, రెండు కార్లు, ఓ మోటర్ సైకిల్, 6 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, నార్సింగి పోలీసులు పట్టుకున్న డబ్బు మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తోన్న బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ( Komatireddy Rajagopal Reddy ) చెందినవిగా వార్తలొచ్చినప్పటికీ.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also Read : Komatireddy Rajagopal Reddy: చేతలతోనే బొంద పెడతా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Also Read : Budida Bikshamaiah Goud: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై బిక్షమయ్య గౌడ్‌కి మరీ అంత కోపం ఎందుకంటే..

Also Read : Harish Rao Meeting: మునుగోడు టీఆర్ఎస్ నేతలతో మంత్రి హరీశ్ రావు కీలక సమావేశం

Also Read : Pawan Kalyan: బిగ్ ట్విస్ట్.. దాసోజు శ్రవణ్‌కు పవన్ కళ్యాణ్ సపోర్ట్.. బీజేపీ-జనసేన కటీఫ్ కన్ఫార్మ్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News