రంజాన్ సందర్భంగా ప్రతీ షాపుకి వెళ్లి డబ్బులు అడుక్కోవడం కోసం మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్‌కి వచ్చిన పలువురు ట్రాన్స్జెండర్లను కిడ్నాపర్లుగా భావించి కొందరు స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఓ ట్రాన్స్‌జెండర్ మరణించింది.
మే 1వ తేది నుండి హైదరాబాద్ పోలీస్ శాఖకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు అన్నీ కూడా పేపర్ లెస్‌గానే జరగాలని.. కనీసం కంప్లైంట్ ఫైల్ చేయడానికి కూడా పేపర్ వాడకూడదని.. అంతా డిజిటల్ పద్ధతినే అనుసరించాలని ఇప్పటికే శాఖకు ఉత్తర్వులు అందాయి.
గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) చిత్రం తీసి వార్తల్లో నిలిచిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు వ్యతిరేకంగా ఇప్పటికే మహిళా సంఘాల నుండి అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటి ఆన్ లైన్ వెబ్సైట్ల ద్వారా కత్తులు, కటార్లు, చురకత్తులు, తల్వార్లను విక్రయించాలంటే పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు అధికారులు తెలిపారు.
తమది రవాణా నెట్వర్క్ కాదని.. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రజలకు వాహనాలు ఎంచుకొనే సౌలభ్యాన్ని కలిగించే సమాచార సామాజిక సేవా సంస్థ అని ఉబర్ ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటుంది.
హైదరాబాద్‌లోని రెండు వేర్వేరు హోటళ్లలో వ్యభిచారం జరుగుతోందని స్పష్టమైన సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయా హోటల్స్ పై దాడి చేసి ఇద్దరు హీరోయిన్స్‌ని అరెస్ట్ చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో హోటల్ పై దాడులు జరిపిన సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ముంబైకి చెందిన రిచా సక్సేనా అనే నటిని, ఆమెతోపాటు ఆమెకి, విటులకి మధ్య బ్రోకర్‌గా పనిచేస్తోన్న మోనిష్ కడాకియాను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులకి అప్పగించారు.
సమ్మిట్ నుండి అతిథులను 45 బస్సుల్లో ఫలక్ నూమా ప్యాలెస్ కు తరలించనున్నారు. తొలుత ప్రధాని మోదీ కాణ్వాయ్.. తరువాత ఇవాంకా కాణ్వాయ్ ను ఆపై సీఎం కేసీఆర్ కాణ్వాయ్, కేంద్ర మంత్రుల కాణ్వాయ్ ను అనుమతించి.. అతిథులను తీసుకువెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.