Happy Pongal 2023: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు

Hyderabad Police Alert: సంక్రాంతిని కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకునేందుకు సిటీ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. ఈ తరుణంలోనే అదును చూసి ఇళ్లను గుళ్ల చేసేందుకు దొంగలు రెడీ అవుతున్నారు. సంక్రాంతికి ఉరెళ్లుందుకు రెడీ అవుతున్న వారికి హైదరాబాద్‌ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2023, 04:23 PM IST
Happy Pongal 2023: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు

Hyderabad Police Alert: మీరు సంక్రాంతి పండుగకు ఊరెళ్లుందుకు రెడీ అవుతున్నారా..? ఇంట్లో బంగారంతో పాటు డబ్బు ఉంచి వెళుతున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. పక్కింటి వాళ్లనో.. వాచ్‌మెన్‌కు అలర్ట్ చేసి వెళ్లండి. లేకపోతే మీరు ఊరి నుంచి తిరిగి వచ్చేలోపు మీ ఇళ్లుగుళ్ల కావడం ఖాయం. హైదరాబాద్‌ సిటీలో తాళాలున్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నదోపిడీ దొంగలు.. మీ ఇళ్లను కొళ్లగొట్టి పండగ చేసుకుంటారు. సో అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తున్నారు నగర పోలీసులు.

సంక్రాంతి పండుగ అంటే కొత్త అల్లుళ్లతో సందడి ఉంటుంది. కానీ హైదరాబాద్‌లో మాత్ర ఇంటికి తాళం వేసి వెళితే.. దొంగలు వేర్వేరు రూపాల్లో వస్తారనేది కొత్త సంప్రదాయంగా మారింది. ఇప్పటికే పల్లెల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సంక్రాంతి పండగను సరదాగా ఎంజాయ్ చేసేందుకు సొంతూళ్లకు పయణమవుతున్నారు. ఇదే అదనుగా పండగల సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే కుటుంబాలను గుర్తించి వారి ఇళ్లను కొల్లగొట్టేందుకు దొంగలు రెడీ అవుతున్నారు.

ఉద్యోగస్తులు మినహా స్కూల్స్‌కు సెలవులు రావడంతో ఇప్పటికే  ఊరిబాట పట్టారు నగరవాసులు. అయితే ప్రతీ ఏటా సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలనే టార్గెట్ చేస్తున్నదొంగల ముఠాలు అందినంత దోచుకెళ్తున్నాయి. ఇలాంటి పండుగలను తమ చోరీలకు కలిసివచ్చిన అవకాశంగా తీసుకుంటున్నఅంతర్రాష్ట్ర దొంగల ముఠాలు వరుస చోరీలతో దొరికింది దోచుకెళ్తున్నాయి. ఇందులో సిటీ శివారు ప్రాంతాల్లోని ఇళ్లతో పాటు అపార్ట్‌మెంట్లను తమ టార్గెట్ చేసుకుని దొంగల ముఠాలు దోపిడీకి పాల్పడుతున్నాయి.

తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి తాళాలు పగులకొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఏసోబాబు (39) వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు మొత్తం 38 కేసులలో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడిని విచారించగా.. పాత నేరస్థుడిగా నిర్ధారణ అయ్యింది. ప్రకాశం జిల్లా కు చెందిన ముద్ద ఏసోబు నగరంలో తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు.

చోరీ చేసిన నగలను అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసిన నిందితుడిపై ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 38 కేసులు నమోదయ్యాయి. ఇదివరకు జైలుకు వెళ్లి వచ్చినా నిందితుడిలో ఎలాంటి మార్పులేదు. అతని వద్ద నుంచి చోరీలకు ఉపయోగిస్తున్న ఒక ఐరన్ రాడ్, రెండు స్క్రూ డ్రైవర్లు, రెండు కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. 

నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్బంగా ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది కూడా నిత్యం గస్తీ చేస్తోందన్నారు. మహారాష్ట్ర, యూపీ, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి సిటీకి వస్తున్న దొంగల ముఠాలు గత సంక్రాంతి పండగకు 20కి పైగా ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాయి. ఇందులో శివారు ప్రాంతాల్లోని కాలనీలు,హై ఫై ఏరియాల్లోని అపార్ట్ మెంట్లలోనే తమ చోరీలకు టార్గెట్ చేసుకుని దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. రెక్కీ నిర్వహిస్తున్న దోపిడీ దొంగలు కేవలం గంటల వ్యవధిలోనే తమ టార్గెట్ పూర్తి చేసేందుకు ఛాన్స్ ఉందని అంటున్నారు పోలీసులు. గత ఏడాది మూడు కమిషనరేట్ల పరిధిలో భారీగా చోరీలు జరిగాయి. సైబరాబాద్ పరిధిలో 584 దొంగతనాలు జరిగాయి. ఇక రాచకొండ పరిధిలో దొంగల బీభత్సం సృష్టించి 25 కోట్ల ప్రాపర్టీ చోరీ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా దాదాపు రూ.22 కోట్లు కొట్టేశారు దొంగలు.

Also Read: Tech Mahindra: డిజిటల్ రంగంలో సరికొత్త అధ్యాయం.. టెక్ మహీంద్రాతో జతకట్టిన మైక్రోసాఫ్ట్‌   

Also Read:  PAK vs NZ: అంపైర్ కాలికి బంతిని విసిరిన పాక్ బౌలర్.. కోపంతో జెర్సీని నేలకు కొట్టి..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News