Hyderabad Police: పోలీస్ శాఖలో అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు. లంచలం ఇవ్వనిదే అక్కడే పని కాదంటారు. కాని ఇతర శాఖల్లో మాదిరిగా పోలీసు శాఖలో ఏసీబీ అధికారులు చాలా తక్కువ. కాని కొంత కాలంగా పోలీసు అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. తాజాగా లంచం కేసులో ఎస్సైకి ఏకంగా రెండేళ్ల జైలు శిక్ష పడింది.
వివరాల్లోకి వెళితే ప్రస్తుతం మాదాపూర్ ఎస్ఐగా పని చేస్తున్న కె రాజేంద్ర.. 2013లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పనిచేశారు. 2013 జూన్‌లో ఇర్షాద్ ఖురేషీ అనే వ్యక్తి మోటారు బైక్ విడుదల చేసేందుకు రాజేంద్ర 10 వేల రూపాయలు డిమాండ్ చేశారు. ఎస్ ఐ వేధింపులను భరించలేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. దీంతో రైడ్ చేసిన ఏసీబీ అధికారులు.. లంచం తీసుకుంటుండగా ఎస్ఐ రాజేంద్రను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఐపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులోనే తాజాగా ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. మాదాపూర్ ఎస్సై కె.రాజేంద్రకు ఏసీబీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా కట్టకపోతే మరో మూడు నెలలు పొడిగించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
Read Also: వివాదంపై స్పందించిన బండ్ల.. ఎన్టీఆర్ ను కూడా ప్రేమిస్తున్నానంటూ !
Read Also: Bandla Ganesh vs Jr NTR: బండ్ల గణేష్-ఎన్టీఆర్ మధ్య అసలు వివాదం ఏమిటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hyderabad Police: లంచం తీసుకుంటూ దొరికిన మాదాపూర్ ఎస్సైకి రెండేళ్ల జైలు
ఏసీబీ కోర్టు సంచలనం
మాదాపూర్ ఎస్సైకి రెండేళ్ల జైలు
లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ