Chikoti Praveen Casino Case: చికోటి ప్రవీణ్ కెసినో కేసులో తలసాని సోదరులను విచారించిన ఈడి

Chikoti Praveen Casino Case: చికోటి ప్రవీణ్ కెసినో కేసులో ఫెమా యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి మనీ ల్యాండరింగ్‌కి పాల్పడిన తీరుతెన్నులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూపీలాగింది. హవాలా మార్గంలో తరలించిన నల్లధనం, చెల్లింపుల వివరాలపై ఈడీ ఆరా తీసింది.

Written by - Pavan | Last Updated : Nov 16, 2022, 10:07 PM IST
  • విదేశాల్లో చికోటి ప్రవీణ్ కెసినో వ్యవహారం ఈడి ఆరా
  • 8 గంటలకుపైగా తలసాని సోదరుల విచారణ
  • మనీ ల్యాండరింగ్‌కి పాల్పడిన తీరుతెన్నులపై కూపీ లాగిన ఈడి
Chikoti Praveen Casino Case: చికోటి ప్రవీణ్ కెసినో కేసులో తలసాని సోదరులను విచారించిన ఈడి

Chikoti Praveen Casino Case: విదేశాల్లో చికోటి ప్రవీణ్ కెసినో వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. విదేశాల్లో కెసినో వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాదాపు 10 గంటలకుపైగా తలసాని సోదరులను విచారించింది. తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్‌లను ప్రశ్నించిన ఈడీ.. వారి నుంచి విదేశాల్లో కేసినోలు నిర్వహించడం, విదేశాల్లో కెసీనోలకు ఇక్కడి ప్రముఖులను ఆహ్వానించడం, ప్రముఖులతో ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలపై ప్రశ్నించింది.

ఫెమా యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి మనీ ల్యాండరింగ్‌కి పాల్పడిన తీరుతెన్నులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూపీలాగింది. హవాలా మార్గంలో తరలించిన నల్లధనం, చెల్లింపుల వివరాలపై ఈడీ ఆరా తీసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన ఈడీ.. వారిని కూడా విచారించి మరిన్ని వివరాలు రాబడుతోంది. ఈడీ సేకరించిన జాబితాలో సుమారు వంద మంది కేసినో కస్టమర్లు ఉన్నట్టు తెలుస్తోంది. 

విదేశాల్లో కేసినోల వ్యవహారంలో కీలక సూత్రదారులైన చికోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డిల కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించి ఈడీ.. అన్నికోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే చికోటి ప్రవీణ్ ప్రముఖులను విదేశాలకు రప్పించే క్రమంలో ఉపయోగించిన ట్రావెల్ ఏజెన్సీని కూడా ఈ విచారణలో భాగం చేసింది. ట్రావెల్ ఏజెన్సీ ఫ్లైట్స్ టికెట్స్ బుకింగ్స్ వివరాలు సేకరించిన ఈడీ... ఆ వివరాల ఆధారంగానే నిందితులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోందని తెలుస్తోంది. రేపు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( Enforcement Directorate ) తలసాని సోదరులను మరోసారి విచారించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

Also Read : TRS MLAs Poaching Case: తెలంగాణలో యూపీ సీన్ రిపీట్.. ఎమ్మెల్యేల డీల్‌ కేసు నిందితుడు నందకుమార్ హోటల్ కూల్చివేత

Also Read : TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసు.. పోలీసులకు నో చెప్పిన ఏసీబీ కోర్టు..

Also Read : ED Raids: తెలంగాణలో సోదాలపై ఈడీ కీలక ప్రకటన.. అసలు కారణం ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News