TSPSC Paper Leakage Case News: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.. లీకులో ఉన్న లింకులు బయటపడుతూనే ఉన్నాయి. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడ్డ రాజేశ్వర్ దంపతుల టాప్ ర్యాంకర్లను సిట్ అరెస్ట్ చేసింది. దీంతో నిందితుల సంఖ్య 34 కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఒకవైపు వరుస అరెస్టులు... మరోవైపు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
ఎప్పటికప్పుడు అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో కొత్త నిందితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. కానీ ఎక్కడ తగ్గని పరిస్థితి నెలకొంది. సిట్ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా... మరికొందరిని విచారిస్తోంది. తవ్వేకొద్ది అక్రమాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఒకరు లవర్ కోసం పేపర్ కొనుగోలు చేస్తే.. మరొకరు భార్య కోసం, ఇంకొకరు స్నేహితుడి కోసం పేపర్ కోనుగోలు చేసిన వ్యవహరం పోలీస్ దర్యాప్తులో వెల్లడవుతోంది. ఇప్పుడు తాజాగా టాప్ ర్యాంక్ సాధించిన వారిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన లీక్ వీరులు మొదటి ర్యాంకు సాధించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. పేపర్ లీకేజీ చేసి డివిజనల్ అకౌంట్స్ అఫీసర్.. డీఏవో పరీక్ష రాసిన ముగ్గురు టాపర్‌లుగా నిలిచారని తేలింది. ఈ కేసులో ఇది వరకే అరెస్టయిన రాజశ్వేర్‌కు మొదటి ర్యాంకు, అతని భార్య శాంతికి రెండో ర్యాంకు, రేణుక స్నేహితుడైన నూతన్ రాహుల్‌కు మూడో ర్యాంకు వచ్చినట్టు వెల్లడైంది. కీలక నిందితుడైన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ రెడ్డి భార్య సుచరిత కూడా పరీక్ష రాసినట్టు విచారణలో తేలింది. దీంతో శాంతి, రాహుల్, సుచరితతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన రమావత్ దత్తులను బుధవారం సిట్ అరెస్ట్ చేసింది.
ఈ కేసులో ఇది వరకే అరెస్టయిన రేణుక, ఆమె సోదరుడు రాజేశ్వర్‌కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా సిట్ భిన్న కోణాలలో ఒక్కో పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం, ఆ పరీక్ష రాసిన వారు, దరఖాస్తు చేసుకొన్న వారి వివరాలపై భిన్న కోణాలలో దర్యాప్తు చేస్తూ ముందుకుసాగుతున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ 34 మంది నిందితులను అరెస్టు చేసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో ఒకవైపు సిట్ , మరోవైపు ఈడీ దూకుడు పెంచుతున్నాయి. క్వశ్చన్ పేపర్ లీకేజ్ లింకులో దాగి ఉన్న పెద్ద లింకులపై ఆరా తీస్తున్నారు.
TSPSC Paper Leakage Case: టిఎస్పీఎస్సీ కేసులో ముగ్గురు టాప్ ర్యాంకర్స్ అరెస్ట్..