Ambulance Driver Caught Drinking Alcohol: అంబులెన్స్‌లోనే మద్యం సెటప్.. డ్రైవింగ్ సీట్లోనే డ్రింకింగ్..

Ambulance Driver Caught Drinking Alcohol : అంబులెన్స్ డ్రైవర్.. ఎంత దూరమైనా.. ఎంత రాత్రయినా.. జోరున కురిసే వర్షమైనా.. అత్యవసర పరిస్థితుల్లో ఎదుటి వారి ప్రాణాలను రక్షించేందుకు దేన్నీ లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందించే గొప్ప గుణం అంబులెన్స్ డ్రైవర్ల సొంతం.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2023, 09:04 PM IST
Ambulance Driver Caught Drinking Alcohol: అంబులెన్స్‌లోనే మద్యం సెటప్.. డ్రైవింగ్ సీట్లోనే డ్రింకింగ్..

Ambulance Driver Caught Drinking Alcohol : అంబులెన్స్ డ్రైవర్ అంటే రోజూ నలుగురి ప్రాణాలు రక్షించే మంచి మనుషులుగా సమాజంలో ఒక గౌరవం ఉంది. ఎంత దూరమైనా.. ఎంత రాత్రయినా.. జోరున కురిసే వర్షమైనా.. అత్యవసర పరిస్థితుల్లో ఎదుటి వారి ప్రాణాలను రక్షించేందుకు దేన్నీ లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందించే గొప్ప గుణం వీరి సొంతం. ఆర్థికంగా అంతంత జీవితాలే అయినా.. చాలిచాలని జీతాలతో నెట్టుకొస్తూ చేస్తున్న పనిలోనే సంతృప్తిని వెతుక్కుంటుంటారు. అందుకే ప్రాణాలు కాపాడిన వైద్యులకు థాంక్యూ చెప్పడం కంటే ముందుగా, ప్రాణాపాయంలో ఉన్న వారిని సకాలంలో ఆసుపత్రికి చేర్చే అంబులెన్స్ డ్రైవర్లకే చెయ్యేత్తి నమస్కరిస్తూ మొదటి థాంక్స్ చెబుతుంటాం. 

అంత గొప్ప వృత్తిలో కొనసాగుతున్న వారికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సోమాజీగూడలో జీ తెలుగు న్యూస్ కెమెరాకు చిక్కిన ఓ దృశ్యం చూస్తే షాక్ అవకమానరు. సోమాజీగూడలో ఓ పేరు మోసిన కార్పొరేట్ ఆసుపత్రి ఎదుట తన అంబులెన్స్ వాహనాన్ని నిలిపిన డ్రైవర్.. వెంటనే ఓ మద్యం బాటిల్ బయటికి తీశాడు. అంబులెన్స్ లోనే కూర్చుని మద్యం సేవించాడు. అదంతా ప్రత్యక్షంగా చూసిన జీ తెలుగు న్యూస్ ప్రతినిధి.. సదరు డ్రైవర్ ని ఇలా చేయడం తప్పు కదా అని నిలదీయగా.. బాధ్యతారాహిత్యమైన సమాధానాలు ఇచ్చాడు. నా మద్యం నేను తాగితే తప్పేంటని ఎదురు ప్రశ్నించాడు. మద్యం మత్తులో ఉన్న అతడికి.. నువ్వు తప్పు చేస్తున్నావు అని అవగాహన కల్పించే ప్రయత్నం చేసినప్పటికీ.. అతడు ఏ మాత్రం వినిపించుకోలేదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo

Trending News