Robbery Inspired by Movies: స్పెషల్ 26, గ్యాంగ్ సినిమాలు చూసి జువెలరీ షాపులో చోరీ.. అరెస్ట్!

Jewellery Shop Robbery: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26 మూవీతో పాటు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన గ్యాంగ్ సినిమాలను మీరూ చూసే ఉండి ఉంటారు కదా... ఆ రెండు చిత్రాల్లో కథనం ఒక్కటే. జువెలరీ షాపులు, బడా బాబుల ఇళ్లలో ఫేక్ ఐడి దాడులు చేసి అందినకాడికి దోచుకుపోవడమే ఈ సినిమాల స్టోరీ. తాజాగా హైదరాబాద్‌లో ఆ స్టోరీని ఇంప్లిమెంట్ చేసిన దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.  

Written by - Pavan | Last Updated : Jun 2, 2023, 05:36 PM IST
Robbery Inspired by Movies: స్పెషల్ 26, గ్యాంగ్ సినిమాలు చూసి జువెలరీ షాపులో చోరీ.. అరెస్ట్!

Jewellery Shop Robbery: సినిమాల ప్రభావం నేరాలపై, నేరస్తులపై ఎంతో ఉంటుందనడానికి నిదర్శనంగా తాజాగా మరో ఘరానా చోరీ కేసు వెలుగుచూసింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26, అలాగే తమిళ స్టార్ హీరో సూర్య నటించిన గ్యాంగ్ సినిమాలను చూసి, వాటినే స్పూర్తిగా తీసుకున్న నిందితులు.. అచ్చం అదే స్టైల్లో పక్క పథకం ప్రకారం స్కెచ్ వేసుకుని మరీ అదే తరహాలో ఫేక్ ఐటీ రైడ్స్ జరిపి చోరీకి పాల్పడ్డారు.

ఈ నెల 27వ తేదీన సిద్ధి వినాయక నగల దుకాణంలో ఐటి అధికారులం అని చెప్పి ఐటి దాడుల పేరుతో దొంగల ముఠా భారీ చోరీకి పాల్పడిన కేసును ఛేదించినట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు తెలిపారు. 

సినీ ఫక్కీలో జువెలరీ షాపులోకి వెళ్లి ఐటీ రైడ్స్ అని చెప్పి మరీ దోపిడికి పాల్పడ్డన దొంగలు.. దుకాణంలోంచి 17 గోల్డ్ బిస్కెట్లతో పరారయ్యారు. ఎన్నో ఏన్నేళ్లుగా ఈ ప్రాంతంలో జువెలరీ బిజినెస్ జరుగుతున్నప్పటికీ.. ఎప్పుడూ ఇలాంటి దోపిడీ జరిగిన దాఖలాలు మాత్రం లేవు.

Also Read: CM KCR Record: రేపటితో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అరుదైన రికార్డు, ఒకే ఒక్కడు

జువెలరీ షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కాల్ డీటేల్ రికార్డుతో పాటు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి దొంగలను పట్టుకున్నట్టు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.  

నిందితులు మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని.. ఈ చోరీలో మొత్తం 10 మంది పాల్గొనగా.. వారిలో నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.

అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుంచి 7 గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగితా నిందితులు నుండి మరో 10 బిస్కెట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురిని రెహ్మాన్, జకీర్, ప్రవీణ్ యాదవ్, ఆకాష్ అరుణ్ గా గుర్తించామని.. ఐటీ ఆఫీసర్లం అని చెప్పి, నకిలీ ఐడీ కార్డ్ చూపించి ఈ ముఠా దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు స్పష్టంచేశారు.

Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. పెండింగ్ డీఏకు గ్రీన్ సిగ్నల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News