AE Exams 2023 Cancelled: కష్టపడి చదువుకుంటూ, ఏళ్ల తరబడి నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తూ వస్తోన్న నిరుద్యోగులకు షాక్ మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టిఎస్పిఎస్సీ నుంచి పేపర్ లీక్ వివాదం రాష్ట్రాన్ని కుదిపేస్తుండగా.. తాజాగా టిఎస్‌పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న జరిగిన ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఏఈ పరీక్ష పేపర్ లీకైనట్టు నిర్ధారణ అవడంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నిర్ణయానికొచ్చింది. త్వరలోనే ఏఈ పరీక్ష తేదీని ప్రకటిస్తామని టిఎస్‌పీఎస్సీ స్పష్టంచేసింది.
ఇదిలావుంటే, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నపత్రాల లీక్ ఉదంతంలో రోజుకొక కొత్త ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మలుపులతో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. ఈ కేసుతో నేరుగా సంబంధం ఉన్న ప్రవీణ్, రేణుకతో పాటు టిఎస్పీఎస్సీలో ఇంకొంతమంది అధికారులను ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మొత్తం 9 మందిని అరెస్ట్ చేయగా ఇందులో ఇద్దరు టిఎస్పీఎస్సీ సిబ్బంది ఉన్నారు.
టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఉదంతంపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. దర్యాప్తు చేపట్టి 48 గంటల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా కమిషన్ ని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తమ ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్.. ప్రతిపక్షాల్లో ముసలం.. కేటీఆర్ కీ రోల్..?
ఇది కూడా చదవండి : Intermediate Exams 2023: ఇవాళ్టి నుంచే ఏపీ, తెలంగాణల్లో ఇంటర్ పరీక్షలు
ఇది కూడా చదవండి : TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలన్నీ లీక్.. ఇదిగో సాక్ష్యం: బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK