మే 1 నుండి హైదరాబాద్ పోలీస్ డిజిటల్ సేవలు

మే 1వ తేది నుండి హైదరాబాద్ పోలీస్ శాఖకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు అన్నీ కూడా పేపర్ లెస్‌గానే జరగాలని.. కనీసం కంప్లైంట్ ఫైల్ చేయడానికి కూడా పేపర్ వాడకూడదని.. అంతా డిజిటల్ పద్ధతినే అనుసరించాలని ఇప్పటికే శాఖకు ఉత్తర్వులు అందాయి.

Last Updated : Apr 29, 2018, 07:49 PM IST
మే 1 నుండి హైదరాబాద్ పోలీస్ డిజిటల్ సేవలు

మే 1వ తేది నుండి హైదరాబాద్ పోలీస్ శాఖకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు అన్నీ కూడా పేపర్ లెస్‌గానే జరగాలని.. కనీసం కంప్లైంట్ ఫైల్ చేయడానికి కూడా పేపర్ వాడకూడదని.. అంతా డిజిటల్ పద్ధతినే అనుసరించాలని ఇప్పటికే శాఖకు ఉత్తర్వులు అందాయి. ఈ కొత్త పద్ధతి ప్రకారం ఈ-ఆఫీస్ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా పనులు చేయనున్నారు పోలీసులు.

ఫిర్యాదు తీసుకోవడంతో పాటు దాన్ని నమోదు చేసి.. ఫిర్యాదుదారుడికి కాపీ ఇవ్వడం మొదలైన పనులు అన్నీ కూడా డిజిటల్ మయం కాబోతున్నాయి. ఈ కార్యకలాపాలు అన్నీ కూడా ఈమెయిల్స్ ద్వారా, సాఫ్ట్‌వేర్ ద్వారానే జరగనున్నాయి. అయితే తొలుత హైదరాబాద్ ప్రాంతానికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనున్నారు. తర్వాత వచ్చిన ఫలితాలను బట్టి రాచకొండ, సైబరాబాద్ పోలీస్ స్టేషన్లకు కూడా డిజిటల్ సేవలు అందించనున్నారు

కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ పోలీస్, హాక్ ఐ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రజలకు స్మార్ట్ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. తాజా పద్ధతిలో మాత్రం ఫిర్యాదుదారుడు  స్టేషనుకి వచ్చి అందించే ఫిర్యాదును పోలీసులే వెబ్ సైటులో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఫిర్యాదు నెంబరును ఫిర్యాదుదారుడికి చెబుతారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలోకి వచ్చే 87 లక్షల జనాభాతో పాటు ఆ జిల్లాకి సేవలందించే 12,000 పోలీసులు అందరి కోసం డిజిటల్ బాటలు వేసేందుకు ప్రయత్నిస్తోంది పోలీసు శాఖ

Trending News