తప్పు చేశానన్న యాంకర్ ప్రదీప్.. వైరల్ అవుతున్న వీడియో

యాంకర్ ప్రదీప్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో అతడు ఇంకా ఏమేం చెప్పాడో మీరే ఈ వీడియోలో చూడండి!

Last Updated : Jan 5, 2018, 06:19 PM IST
తప్పు చేశానన్న యాంకర్ ప్రదీప్.. వైరల్ అవుతున్న వీడియో

డిసెంబరు 31న రాత్రి హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు జరిపిన డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీల్లో మద్యం మత్తులో కారు నడుపుతూ పట్టుబడిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం పరారీలో వున్నాడని బుధవారమే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ గురువారం కూడా ప్రదీప్ తమ ఎదుట హాజరు కానట్లయితే, కేసు లా అండ్ ఆర్డర్ పోలీసుల వరకు వెళ్తుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు చేసిన ప్రకటనతో 'ప్రముఖ యాంకర్ ప్రదీప్ పరారీలో వున్నాడట' అనే ప్రచారం ఊపందుకుంది. 

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై స్పందించిన ప్రదీప్.. తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో కారు నడపడం తప్పేనని అంగీకరించిన ప్రదీప్.. తాను చేసిన తప్పుని మరెవ్వరూ చేయవద్దంటూ ఆ వీడియోలో విజ్ఞప్తిచేశాడు. తాను పరారీలో వున్నాననే ప్రచారంలో నిజం లేదు. కేవలం ముందస్తుంగా అంగీకరించిన కార్యక్రమాలు, ఈవెంట్లకి హాజరు కావాల్సి వున్న కారణంగానే తాను పోలీసుల ఎదుట హాజరుకాలేకపోయానే తప్పితే ఇందులో తనకు ఇంకే దురుద్దేశం లేదని ప్రదీప్ ఈ వీడియోలో పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్లో యాంకర్ ప్రదీప్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో అతడు ఇంకా ఏమేం చెప్పాడో మీరే ఈ వీడియోలో చూడండి!

 <

>

Trending News