గజల్ శ్రీనివాస్ కేసు: పోలీసుల చేతిలో 20 అశ్లీల చిత్రాల వీడియోలు

లైంగిక వేధింపుల కేసులో ఎంతో కీలకమైన ఈ వీడియో సాక్ష్యాలని నేడు పోలీసులు కోర్టుకి సమర్పించే అవకాశం వుంది.

Last Updated : Jan 4, 2018, 05:34 PM IST
గజల్ శ్రీనివాస్ కేసు: పోలీసుల చేతిలో 20 అశ్లీల చిత్రాల వీడియోలు

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో ఊచలు లెక్కిస్తున్న గజల్ శ్రీనివాస్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంటోంది. గజల్ శ్రీనివాస్ అరాచకాలపై పూర్తి ఆధారాలతో పోలీసులని ఆశ్రయించిన బాధితురాలు తాజాగా మరిన్ని వీడియో సాక్ష్యాలని పోలీసులకి సమర్పించారు. ఈసారి బాధితురాలు పోలీసులకి సమర్పించిన సాక్ష్యాధారాల్లో 20 వరకు అశ్లీల వీడియోలు వున్నాయని సమాచారం. సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వుంటూ ఆ సంస్థకి సంబంధించిన కార్యాలయాన్ని గజల్ శ్రీనివాస్ ఓ బ్రోతల్ హౌజ్‌గా మార్చాడని బాధితురాలు పోలీసులకి పూసగుచ్చినట్టు వివరించారు. అంతేకాకుండా గజల్ శ్రీనివాస్ బాధితుల జాబితాలో తనలాంటి వాళ్లు ఎందరో వున్నారని ఆమె పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. గంటల కొద్ది నిడివిగల ఒక్కో వీడియోలో గజల్ శ్రీనివాస్‌కి సంబంధించిన ఒక్కో అరాచకం నిక్షిప్తమై వున్నట్టు తెలుస్తోంది. లైంగిక వేధింపుల కేసులో ఎంతో కీలకమైన ఈ వీడియో సాక్ష్యాలని నేడు పోలీసులు కోర్టుకి సమర్పించే అవకాశం వుంది.

గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటీషన్ సైతం ఈరోజు మరోమారు విచారణకు రానుంది. గజల్‌కి బెయిల్ మంజూరు చేస్తే, అతడు బాధితురాలిని, అతడికి అనుకూలంగా వున్న సాక్ష్యులని బెదిరించే ప్రమాదం వున్నందున ఈ కేసులో అతడికి బెయిల్ మంజూరు చేయకూడదు అని పోలీసులు బుధవారమే నాంపల్లి కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికితోడు తాజాగా చేతికి చిక్కిన మరిన్ని వీడియో సాక్ష్యాలని సైతం కోర్టుకి అందచేసి అతడికి బెయిల్ మంజూరు కాకుండా వుండేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Trending News