భాగ్యనగరంలో ఉబర్‌కు షాక్..!

తమది రవాణా నెట్‌వర్క్ కాదని.. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రజలకు వాహనాలు ఎంచుకొనే సౌలభ్యాన్ని కలిగించే సమాచార సామాజిక సేవా సంస్థ అని ఉబర్ ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటుంది. 

Last Updated : Jan 20, 2018, 04:09 PM IST
భాగ్యనగరంలో ఉబర్‌కు షాక్..!

తమది రవాణా నెట్‌వర్క్ కాదని.. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రజలకు వాహనాలు ఎంచుకొనే సౌలభ్యాన్ని కలిగించే సమాచార సామాజిక సేవా సంస్థ అని ఉబర్ ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటుంది. నేడు ప్రజలకు ఆన్‌లైన్ ట్యాక్సీ సర్వీసులు అందివ్వడంలో ఓలా, ఉబర్ సంస్థలు ముందున్నాయన్న విషయం తెలిసిందే.  అలాంటి ఉబర్ డ్రైవర్లు నలుగురిని శుక్రవారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అసలు విషయానికొస్తే.. ఆ అయిదుగురు డ్రైవర్లు కూడా లైసెన్స్ లేకుండా తమ వాహనాలను రోడ్డుపైకి తీసుకురావడమే ప్రధాన కారణమని బహిర్గతమైంది. ఆ వాహనాలను సీజ్ చేసినట్లు రవాణాశాఖ ప్రకటించింది. అయితే ప్రయాణికుల భద్రతే పరమావధి అని చెప్పుకుతిరిగే ఈ సర్వీస్ ప్రొవైడర్లు, సరైన వైరిఫికేషన్ ప్రక్రియ లేకుండా డ్రైవర్లను రిక్రూట్ చేసుకోకూడదని అంటున్నారు పలువురు అధికారులు. ఉబర్ ఇటీవలే కార్లు, టాక్సీలతో పాటు టాక్సీ బైక్లను కూడా ప్రవేశబెట్టింది. 

Trending News