బిగ్ బాస్-3 సీజన్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి తనను కలిసిన ఆ ప్రోగ్రాం ఇన్చార్జ్లు శ్యామ్, రఘులు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన యాంకర్ శ్వేతా రెడ్డి.
హైదరాబాద్ చర్లపల్లి జైలులో యాచకుల పునారావస కేంద్రంలో నివసిస్తున్న ఓ ముసలావిడ వద్ద దాదాపు రూ.2 లక్షల రూపాయల సొమ్ము ఉండడం చూసి ఆశ్రమ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు.
హైదరాబాద్ పాత బస్తీలోని మిర్ చౌక్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సారంగపాణి ఓ వ్యక్తి నుంచి రూ.50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. బాధితుడు తమకు ఇచ్చిన సమాచారం మేరకే ఎస్సై సారంగపాణి అతడి నుంచి లంచం పుచ్చుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్సైతోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో కానిస్టేబుల్ని సైతం ఏసీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
విదేశాల నుంచి భారత్కి పాకుతున్న పాశ్చాత్య సంస్కృతి పలు సందర్భాల్లో స్థానిక పోలీసులకు తలనొప్పులు తీసుకొస్తోంది. తాజాగా భారత యువతను ఆకర్షిస్తోన్న కికి ఛాలెంజ్ సైతం పోలీసులకు అలాంటి తలనొప్పులనే తీసుకొచ్చింది. తెలంగాణలో కానీ హైదరాబాద్ రోడ్లపై కానీ కికి ఛాలెంజ్ స్వీకరించే సాహసం చేయొద్దని, లేని పక్షంలో కికీ ఛాలెంజ్ స్వీకరించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పాప్ సింగర్ డ్రేక్ గత నెలలో విడుదల చేసిన 'ఇన్ మై ఫీలింగ్స్' ఆల్బం పాట పేరుపై ఈ కికి ఛాలెంజ్ పుట్టుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.