తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఆగడం లేదు. మొన్నటి వరకూ భారీ వర్షాలు, వరదలతో కుదేలైన రాష్ట్రాలు ఇప్పుడు మరోసారి వర్షాల బారిన పడ్డాయి. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి.
Rain Alert Live Updates: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడం మరికొన్ని గంటల్లో వాయుగుండం మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఖమ్మం జిల్లాలో గత రెండ్రోజుల్నించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంట పొలాలు నీట మునగడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. వాగులు , వంకలు, చెరువులు పొంగి పొర్లడంతో పంటలు నీట మునిగాయి.
Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Telangana Rain Alert: వరదల ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే మరోసారి వరద గండం ముంచుకొస్తోంది. తెలంగాణకు తాజాగా మరోసారి హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Rain Alert Telangana: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒరిస్సా తీరం దాటి పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తీరంలో కొనసాగుతూ వుంది.
శ్రీశైలం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో అటవీ ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు శ్రీశైలం జలాశయం సమీపంలో కొండ చరియలు విరిగి పడినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు
ఏపీ, తెలంగాణ తరువాత ఇప్పుడు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగుపై కల్వర్ట్ దాటుతుండగా..ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. చుట్టూ ఉన్న జనం కేకలు పెట్టడం, వీడియో తీసేందుకు ఆసక్తి చూపించారు తప్పిస్తే..కాపాడే ప్రయత్నాలు చేయలేదు.
Musi River Flood: హైదరాబాద్‌లోని మూసీ నది వరద నీటితో పోటెత్తుతోంది. నగరంలోని జాలాశయాల్నించి నీరు వదలడంతో మూసీ ప్రవాహం పెరుగుతోంది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాలు ముంపుకు గురవుతున్నాయి.
Telangana Rains: Minister KTR Review Meeting on Telangana Rains. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.
Amarnath Yatra: భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యాత్ర వాయిదాపడింది. ఇప్పటివరకూ 4 వేల మందికి పైగా యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చార్మినార్, బహదూర్ పురా, ఫలక్‌నుమా, బార్కస్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, మలక్‌పేట, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, చంపా పేట్, సంతోష్ నగర్, చాదర్‌ఘాట్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురంలో భారీగా వర్షం పడింది. ఉరుములతో కూడిన వర్షం కురిసింది.
Telangana Rain alert: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం కూడా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Mahaboobabad Heavy Rains : మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. చెరువులు మత్తడిపోస్తున్నాయి. అనేక చోట్ల రహదారులపైకి వరద నీరు రావడంతో రహదారులు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.