Rain Alert Telangana: రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు..!

Rain Alert Telangana: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒరిస్సా తీరం దాటి పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌ తీరంలో కొనసాగుతూ వుంది.

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 04:39 PM IST

Rain Alert Telangana: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒరిస్సా తీరం దాటి పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌ తీరంలో కొనసాగుతూ వుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం విస్తరించి ఉంది. దీంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో.. తేలికపాటి నుండి మోస్తరు వానలు పడే అవకాశం వుందని వాతావరణ తెలిపింది. ఈనేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ,15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Video ThumbnailPlay icon

Trending News