Rain Alert Live Updates: ఇవాళ, రేపు కుంభవృష్టి.. తెలుగు రాష్ట్రాలకు వాయుగండం.. ఐఎండీ వార్నింగ్ తో కలవరం..

Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Last Updated : Aug 8, 2022, 10:43 AM IST
Rain Alert Live Updates: ఇవాళ, రేపు కుంభవృష్టి.. తెలుగు రాష్ట్రాలకు వాయుగండం.. ఐఎండీ వార్నింగ్ తో కలవరం..
Live Blog

Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం బలపడి మరో 48 గంటల్లో వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కుండపోతహా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

8 August, 2022

  • 10:43 AM

    గత 24 గంటల్లో ఏపీలో నమోదైన వర్ష పాతం వివరాలు.

    విశాఖ జిల్లా చింతపల్లి  10 సెంటిమీటర్లు

    కర్నూల్ జిల్లా ఆత్మకూరు 5 సెంటిమీటర్లు

    పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి  4 సెంటిమీటర్లు

    తూర్పు గోదావరి జిల్లా చింతూరు 4 సెంటిమీటర్లు

    ప్రకాశం జిల్లా బెస్తవారిపేట  4 సెంటిమీటర్లు

    పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం 4 సెంటిమీటర్లు

    ప్రకాశం జిల్లా కంభం  4 సెంటిమీటర్లు

    శ్రీకాకుళం జిల్లా టెక్కలి ౩ సెంటిమీటర్లు

     

  • 09:44 AM

    హైదరాబాద్ భారీ వర్ష సూచన

    నగరం లోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం

    అధికారులను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్

    నీళ్లు నిలిచిపోయే ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలని ఆదేశం

     నాలా పరిసరాల్లో ప్రజలు రాకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచన

     

  • 09:41 AM

    నిజాంసాగర్ ప్రాజెక్టు కు పెరిగిన వరద..

    ఇన్ ఫ్లో 22400 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో 21600 క్యూసెక్కులు

    నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు

    ప్రస్తుతం 16.357 టీఎంసీలు

  • 08:00 AM

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమైంది. ప్రస్తుతం ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంపై ఉందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉంది. అటు రుతుపవనాల ద్రోణి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నుంచి అల్పపీడనం ప్రాంతం వరకూ వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. కొన్ని గంటల్లోనే కుంభవృష్టి మాదిరిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.

     

  • 07:34 AM

    ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు తెలంగాణలోని  పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, ములుగు, అసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, వికారాబాదా, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లా ముల్కచర్లలో 127 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ధర్మారంలో 126, భద్రాద్రి జిల్లా మందలపల్లిలో 120, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దంపేటలో 97, ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 90, మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేటలో 89 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. 3 కేంద్రాల్లో అత్యంత భారీ వర్షం కురవగా 32 ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. 448 ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా... 460 కేంద్రాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

Trending News