COVID-19 Cases in AP: ఏపీలో కరోనా పరిస్థితిపై క్లారిటీ ఇదిగో

COVID-19 Cases in AP: ఏపీలో కొవిడ్-19 వైరస్ ఇన్‌ఫెక్షన్ తాజా పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ స్పందించారు. కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ఏపీ సర్కారు అప్రమత్తంగా ఉందని.. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం అని జె. నివాస్ ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 10:15 AM IST
COVID-19 Cases in AP: ఏపీలో కరోనా పరిస్థితిపై క్లారిటీ ఇదిగో

COVID-19 Cases in AP: చైనాలో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ సైతం అప్రమత్తమైంది. కరోనావైరస్ పాజిటివ్ కేసుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టంచేసింది. ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ సోకిన వారిని గుర్తించే విధంగా అవసరమైన చోట కరోనా వైరస్ పాజిటివ్ పేషెంట్స్ శాంపిల్స్ సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్ కి పంపించాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందనే ఆందోళన నెలకొని ఉంది. 

ఈ సందర్భంగా ఏపీలో కొవిడ్-19 వైరస్ ఇన్‌ఫెక్షన్ తాజా పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ స్పందించారు. కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ఏపీ సర్కారు అప్రమత్తంగా ఉందని.. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం అని జె. నివాస్ ప్రకటించారు. నవంబర్ నుండి దాదాపు 30 వేల మంది శ్యాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా 130 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని అన్నారు. అన్ని కేసుల్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ తప్ప కొత్త వేరియంట్స్ నమోదు కాలేదు అని నివాస్ స్పష్టంచేశారు.

ఏపీలో కరొనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ కేసులను గుర్తించేందుకు జినోమ్ సీక్వెన్సింగ్ టెస్టులకు అన్ని ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారికి వైద్య పరీక్షలు చేసే విధంగా 29 ల్యాబ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసియు బెడ్లు సిద్ధంగా ఉంచాం. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు, మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌‌ల ద్వారా ప్రజా ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది అని ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్ స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి : Corona Cases: కరోనా భయంతో మూడేళ్లుగా గదిలో దాక్కున్న తల్లీకూతుళ్లు.. తలుపులు తీయడానికి వెళితే..

ఇది కూడా చదవండి : Vijayawada Pregnant Women: నొప్పులు వస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ వైద్య సిబ్బంది.. నేలపై బిడ్డను ప్రసవించిన గర్భిణి!

ఇది కూడా చదవండి : Ap Rains: ఏపీకి మళ్లీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News