COVID-19 cases: తెలంగాణ, ఏపీలో కరోనా కేసులపై లేటెస్ట్ అప్‌డేట్స్

Corona second wave in Telangana: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా 691 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ ఐదుగురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ర్టంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,38,721 కి చేరుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 22, 2021, 12:22 AM IST
COVID-19 cases: తెలంగాణ, ఏపీలో కరోనా కేసులపై లేటెస్ట్ అప్‌డేట్స్

Corona second wave in Telangana: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా 691 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ ఐదుగురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ర్టంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,38,721 కి చేరుకుంది. అలాగే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,771 కి పెరిగింది. 

ఇప్పటివరకు రాష్ట్రంలో 6,25,042 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ర్టవ్యాప్తంగా 9,908 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా ఓ హెల్త్ బులెటిన్ (Telangana health bulletin) విడుదల చేసింది.

Also read : Delta virus transmits through air: డెల్టా వైరస్ గాలి ద్వారా సోకుతుంది

ఇదిలావుంటే, ఏపీలో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ (AP Health bulletin) ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 2,527 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... అదే సమయంలో 19 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ర్టంలో 19,46,749 మందికి కరోనా వైరస్ (Coronavirus) సోకగా.. రాష్ర్ట వ్యాప్తంగా 13,197 మంది కరోనాతో కన్నుమూశారు. ప్రస్తుతం రాష్ర్టంలో 23,939 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Also read : Health tips: వ్యాయమంతో Weight loss, fitness మాత్రమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News