Third wave: తెలంగాణ సర్కారుపై హై కోర్టు ఆగ్రహం.. థర్డ్ వేవ్ ఆగుతుందా అని మండిపాటు

Telangana High court slams Telangana govt: రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి విషయంలో ప్రస్తుత పరిస్థితులపై విచారణ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై కోర్టు మండిపడింది.  పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ సంఖ్యలో కేసులు (COVID-19 cases) పెరిగిపోతుండటం గమనించిన తర్వాతైనా మేలుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 8, 2021, 06:10 PM IST
  • కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకోరా ?
  • స్వయంగా కోర్టే ఆదేశించినా స్పందించరా ?
  • పోరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు చూసైనా తేరుకోవాలి.
Third wave: తెలంగాణ సర్కారుపై హై కోర్టు ఆగ్రహం.. థర్డ్ వేవ్ ఆగుతుందా అని మండిపాటు

Telangana High court slams Telangana govt: హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ఆ ముప్పును ఎదుర్కొనేందుకు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి విషయంలో ప్రస్తుత పరిస్థితులపై విచారణ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై కోర్టు మండిపడింది. అయితే, థర్డ్ వేవ్‌ను (Third wave) ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు కోర్టుకు తెలిపారు. కానీ ప్రభుత్వ వైఖరిపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఎం.ఎస్. రామచంద్ర రావు, జస్టిస్ టి. వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 

ప్రభుత్వం రూపొందించే ప్రణాళికలు పూర్తయ్యే వరకు వచ్చే థర్డ్ వేవ్ వేచి చూడదని హై కోర్టు చురకలు అంటించింది. కరోనావైరస్ (Coronavirus) సోకి సకాలంలో చికిత్స అందక చాలా మంది చనిపోయారని, ఇకనైనా ఆ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇకపై మళ్లీ ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు గుర్తుచేసింది. పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ సంఖ్యలో కేసులు (COVID-19 cases) పెరిగిపోతుండటం గమనించిన తర్వాతైనా మేలుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది.

Also read : Heavy Rains in Telangana: తెలంగాణలో భారీవర్షాలు.. నిలిచిపోయిన రాకపోకలు

థర్డ్ వేవ్ విషయంలో (Coronavirus third wave) జాగ్రత్తలు తీసుకుని, తగిన చర్యలు చేపట్టాల్సిందిగా సూచిస్తూ హై కోర్టు స్వయంగా ఆదేశించినప్పటికీ ఇంతవరకు నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించపోవడం ఏంటని కోర్టు ప్రశ్నించింది. జనగాం, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కేసుల పాజిటివిటీ రేటుపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. థర్డ్ వేవ్ వల్ల చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందన్న హోచ్చరికలు, ఆందోళనల నేపథ్యంలో వారి సంక్షేమం కోసం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని హై కోర్టు (Telangana High court) స్పష్పంచేసింది.

Also read : Second wave in Telangana: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్‌పై కీలక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News