AP CM YS Jagan: ఏపీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కోవిడ్‌ సోకితే..

AP CM Jagan's Review Meeting on COVID-19 Cases: కొవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతున్నందున ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా కొవిడ్ పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనావైరస్ లేటెస్ట్ వేరియంట్స్‌ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ ఆరా తీశారు. ఇకపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇలా ఉన్నాయి..

Written by - Pavan | Last Updated : Apr 11, 2023, 04:03 AM IST
AP CM YS Jagan: ఏపీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కోవిడ్‌ సోకితే..

AP CM Jagan's Review Meeting on COVID-19 Cases: దేశంలో మరోసారి కొవిడ్-19 కేసులు సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నందున ఏపీలో కొవిడ్ కేసులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ తాజా పరిస్థితిపై సీఎం జగన్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరగకుండా ఉండేందుకు తీసుకుంటున్న నివారణ చర్యల గురించి ఈ సమీక్షా సమావేశంలో సంబంధిత ఉన్నతాధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

విలేజ్‌ క్లినిక్స్‌ స్ధాయిలోనే ర్యాపిడ్‌ టెస్టులు చేసే వ్యవస్థ సిద్ధంగా ఉందని, గ్రామీణ స్థాయిలో ఏమైనా కేసులు ఉన్నట్టు తేలితే వెంటనే ఆర్టీపీసీఆర్‌కు పంపించే ఏర్పాటు చేశామని అధికారులు ముఖ్యమంత్రి జగన్ కి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే చేయించామని.. కేవలం 25 మందికి మాత్రమే కోవిడ్‌ సోకిన కారణంగా ఆస్పత్రిలో చేరారని నిర్ధారించుకున్నట్టు తెలిపారు. ఆక్సిజన్‌ లైన్స్, పీఎస్‌ఏ ప్లాంట్స్, ఆక్సిజన్‌ సిలెండర్స్, ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్స్ వంటి అత్యవసర సామాగ్రిని కూడా చెక్‌ చేసి సిద్ధంచేసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల నుంచి ర్యాపిడ్‌ శాంపిల్స్‌ తీసుకునేందుకు విమానాశ్రయాల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా సంబంధిత ఉన్నతాధికారులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ముందు జాగ్రత చర్యల్లో భాగంగా అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజీ క్లినిక్స్‌ వ్యవస్ధ కోవిడ్‌ విస్తృతిని అడ్డుకోవడానికి, మంచి వైద్యం అందించేలా చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామాల్లో సర్వే చేసి, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి, వారికి వెంటనే మందులు ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్ సోకినట్టయితే.. వెంటనే వారిని హాస్పిటల్‌కి తరలించి తగిన వైద్య సహాయం అందించేలా చర్యలు ఉండాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టంచేశారు.

 

ప్రతీ విలేజ్‌ క్లినిక్‌కూ టెస్టింగ్‌ కిట్స్, మందులు పంపించాలని.. ప్రస్తుతం ఉన్న వేరియంట్‌కు తగినట్టుగా మందులు తెప్పించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు. ల్యాబులను అన్నింటినీ కూడా అన్నిరకాల వైద్య పరీక్షలకు అనువుగా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాల్లో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
మొదటి ప్రాధాన్యతలో భాగంగా ముందే నిర్దేశించుకున్న విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన కాలేజీల్లో కూడా పనులను ముందుకు తీసుకెళ్తున్నామని అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిపారు.

ఇది కూడా చదవండి : CM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఆ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు

పలాస కిడ్నీ స్పెషాల్టీ హాస్పిటల్, కర్నూలులో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ కడప జిల్లా కేంద్రంలో జీజీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ, కేన్సర్‌ విభాగంతో సహా మూడు బ్లాకులు ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉన్నాయని.. ఇంకొన్నిరోజుల్లోనే ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సాంబశివా రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ బి చంద్రశేఖర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె నివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, డ్రగ్స్‌ డీజీ రవి శంకర్, ఏపీవీవీపీ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్‌ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : AP BRS Chief Thota Chandra Sekhar: చంద్రబాబుని మించిన జగన్.. పీవీ తర్వాత మళ్లీ కేసీఆరే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News