Covid Vaccine for Children: 12- 14 ఏళ్ల వయసు చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీ అవాస్తవం

Covid Vaccine for Children: మార్చి నుంచి 12-14 ఏళ్ల వయసు చిన్నారులకు కరోనా టీకా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. దీనిపై ఆరోగ్య శాఖ ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. 15 - 18 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొనసాగుతుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2022, 11:37 AM IST
    • చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం అధికారుల స్పందన
    • ఇప్పట్లో 12 - 14 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీ లేదని స్పష్టం
    • దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం
Covid Vaccine for Children: 12- 14 ఏళ్ల వయసు చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీ అవాస్తవం

Covid Vaccine for Children: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దేశంలోని వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు 15 నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. 

అయితే 15 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు టీకా పంపిణీ చేయనున్నట్లు చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. 12-14 ఏళ్ల టీనేజర్లకు టీకా ఇవ్వాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.

మరోవైపు మార్చి 15 నుంచి చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని జాతీయ కొవిడ్​-19 వర్కింగ్​ గ్రూప్​ ఛైర్మన్​ డాక్టర్​ ఎన్​కే అరోడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఈ గ్రూప్ చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీ చేయడంపై కేంద్ర వైద్య శాఖ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 

ప్రస్తుతం దేశంలో 15-18 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ప్రక్రియ మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సోమవారం అరోడా పేర్కొన్నారు. అదే నెలలో 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. 

మార్చి నెల నుంచే ఆ వయసు వారికి..

ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం మార్చి నెల నాటికి 15 - 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. అనుకున్న ప్రణాళిక ప్రకారం 15 - 18 ఏళ్ల వారికి కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి అయితే అదే నెల నుంచి 12 - 14 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి వ్యాక్సిన్ పంపిణీ చేసే అవకాశం ఉంది. 

దేశంలో 15- 18 ఏళ్ల వయస్సున్న చిన్నారులు దాదాపుగా 7.4 కోట్ల మంది ఉన్నారు. ఇప్పటికే వీరిలో 3.45 కోట్ల మంది మొదటి డోసు తీసుకున్నారు. కోవాగ్జిన్ ఇస్తుండటంతో 28 రోజుల వ్యవధిలోనే రెండవ డోసు ఉంటుంది. మార్చ్ 12 వ తేదీ నుంచి మాత్రం 12- 15 ఏళ్ల చిన్నారులకు సైతం కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  

Also Read: India Corona Cases Today: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 2,38,018 కరోనా కేసులు, 310 మరణాలు

Also Read: Corona vaccine for Children: మార్చ్ 12 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News