COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 183 కరోనావైరస్ పాజిటివ్ కేసులు గుర్తించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,354 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 183 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనావైరస్ పాజిటివ్ కారణంగా ఇద్దరు చనిపోగా ప్రస్తుతం రాష్ట్రంలో 4,196 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటివరకు కరోనావైరస్ (Coronavirus cases in Telangana) సోకిన వారి సంఖ్య మొత్తం 6,68,070 కి చేరగా మృతుల సంఖ్య 3,932 కి పెరిగింది.
సోమవారం నాడు 220 మంది కరోనావైరస్ పేషెంట్స్ కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,59,942 కి చేరింది. ప్రస్తుతం కేస్ ఫెటలిటి రేట్ 0.58 శాతంగా ఉండగా రికవరి రేటు 98.78 శాతంగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2.68 కోట్ల మందికి కరోనా వైరస్ పరీక్షలు (Coronavirus tests) చేశారు. ప్రతీ 10 లక్షల మందిలో 7.20 లక్షల మందికి కరోనావైరస్ పరీక్షలు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
Also read : Huzurabad bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి Kanhaiya Kumar, Hardik Patel !
తాజాగా నమోదైన కరోనా కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (COVID-19 cases in GHMC) పరిధిలోనే అత్యధికంగా 53 కేసులు నమోదు కాగా ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో 20 కేసులు వెలుగుచూశాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు గుర్తించగా రంగా రెడ్డి జిల్లాలో 8 కేసులు, సంగా రెడ్డి జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోంచి మిగతా కేసులు నమోదయ్యాయి.
ఇదిలావుంటే, మరోవైపు దేశంలో కొత్తగా నమోదైన కరోనావైరస్ (Coronavirus india updates) కేసుల సంఖ్య 18 వేలు దాటింది. కొవిడ్ వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియ సైతం నిరంతరాయంగా కొనసాగుతోంది. మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌తో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను చేపడుతున్నారు.
Also read : Tenth class papers in Telangana: టెన్త్ పరీక్షల్లో 'ఆరు' పేపర్లే...కేసీఆర్ సర్కారు కీలక ఉత్తర్వులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook