Pawan Kalyan's Speech From His Varahi Yatra in Visakhapatnam: ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ, " జగన్కు డబ్బు అంటే పిచ్చి. విపరీతమైన పిచ్చి. సంపాదించిన దాన్ని ఏం చేసుకుంటారో కూడా తెలియని పిచ్చి. కరెన్సీను తాలింపు వేసి అన్నంగా కలుపుకొని తింటాడేమో తెలియదు కానీ.. దాన్ని సంపాదించేందుకు తన, మన అనే బేధం కూడా చూడడు. ఇప్పుడు ఆ పిచ్చే ఆంధ్ర ప్రజలను పట్టి పీడిస్తోంది " అని ఆవేదన వ్యక్తంచేశారు.
Pawan Kalyan About Vizag City: విశాఖపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో గొప్ప ఆశయం కోసం ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టి, ఓటమిలో ఉన్న నాకు రాజకీయ పునరుజ్జీవం పోసింది విశాఖ నగరమే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
FIR Filed On Chandrababu Naidu: అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసు స్టేషన్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ముదివేడు పోలీసులు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు.
Jagan and Jp Meet: ఏపీలో ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైనాట్ 175 లక్ష్యం పెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ చిన్న అవకాశాన్ని వదలదల్చుకోలేదు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..
Chandrababu Pulivendula Tour: రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని సిఎం జగన్ నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పుడు రాష్ట్రమే రివర్స్ లో ఉంది అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం మనకు ఇచ్చిన వరం పోలవరం. నేను పట్టుకుంటే ఉడుము పట్టే. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత నాది అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపైనా విమర్శలు చేశారు.
AP Politics: ఏపీలో ఎన్నికల సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నేతల్ని కలిసే సెలెబ్రిటీలతో రాజకీయ ముఖచిత్రం మారవచ్చన్పిస్తోంది. తాజాగా మంచు మనోజ్ కుటుంబంతో చంద్రబాబుని కలవడం వెనుక రాజకీయం చాలానే ఉందన్పిస్తోంది.
Kinjarapu Rammohan Naidu News: శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో వైసీపీకి కొరుకుడు పడని ఒకే ఒక ఏదైనా ఉందా అంటే అది అక్కడి లోక్ సభ సీటు అనే చెప్పుకోవచ్చు. పార్టీ పెట్టి పోటీ చేసిన రెండు ఎన్నికల్లోనూ వైసీపీకి ఈ సీటు అందని ద్రాక్షే అయింది. మరి వచ్చే ఎన్నికల్లో అయినా సరే ఆ స్థానాన్ని తమ కైవసం చేసుకుని అక్కడ వైసీపీ జండా పాతాలని ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ భావిస్తున్న నేపథ్యంలో శ్రీకాకులం రాజకీయాలపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్.
Gangadhara Nellore MLA Politics: చిత్తూరు జిల్లాలో జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్సికి రిజర్వేషన్ అయింది. జీడీ నెల్లూరు అంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గం అనే విషయం తెలుసు కదా.. గతంలో ఇక్కడ టీడీపీకి మంచి పట్టు ఉండింది. అప్పటి డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ కాంగ్రెస్ పార్టీ తరపున ఒకసారి, టీడీపీ తరపున ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Jagan Anna Thodu Scheme Money: జగనన్న తోడు పథకం ద్వారా నేడు అందిస్తున్న రూ. 549.70 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు 15,87,492 మంది చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాలు కింద రూ. 2,955.79 కోట్లు అందించినట్టు ఏపీ సర్కారు స్పష్టంచేసింది.
Vangalapudi Anitha Comments on YS Bharathi, Sajjala Bhargav Reddy: సీఎం జగన్ని ప్రశ్నించడమే తాను చేసిన తప్పా అని తాను ఎంతో బాధపడ్డానని అనిత మీడియాకు తెలిపారు. అయినా సరే తాను ఏడవనని.. ఎందుకంటే తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని ఏడిపించే రోజు వస్తుందని అన్నారు. చదువుకున్న దళిత ఆడబిడ్డను నేను. నాకు అండగా నిలిచింది చంద్రబాబు నాయుడు అని అన్నారు.
Daggubati Purandeshwari: ఏపీకి బీజేపి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి ఎదుట ఆ పార్టీ హై కమాండ్ బిగ్ టాస్క్ పెట్టిందని స్వయంగా ఆమె మాటల్లోనే అర్థం అవుతోంది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా రాష్ట్రంలో బీజేపిని బలోపేతం చేసే గురుతర బాధ్యతను బీజేపి పురంధేశ్వరిపై పెట్టింది.
Janasena Leader Satires on Minister Jogi Ramesh: పెడన: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత రాంసుధీర్ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. మైలవరం నుంచి అక్కడి ప్రజలు తన్ని తరిమేస్తేనే.. పెడన వచ్చి పడ్డాడు అని అన్నారు.
AP Poll Strategy Survey: ఎన్నికలు సమీపించేకొద్దీ సర్వేల ప్రభావం పెరుగుతోంది. మొన్న టైమ్స్ నౌ భారత్ సర్వే తరువాత ఇప్పుడు మరో సంస్థ సర్వే సంచలనం రేపుతోంది. ఏపీలో ఈసారి అధికారం ఎవరిదో ఆ పార్టీ సంచలన సర్వే వెలువరించింది. పూర్తి వివరాలు మీ కోసం..
Pawan Kalyan Questions to AP CM YS Jagan: తాడేపల్లి గూడెంలో బుధవారం జరిగిన బహిరంగసభలో వారాహి వాహనం మీదుగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ... ఏపీలో వాలంటీర్ వ్యవస్థ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ రూలింగ్ పార్టీ ఇస్తోన్న కౌంటర్లకు సమాధానం ఇచ్చారు. తనకు వాలంటీర్ల మీద వ్యక్తిగత ద్వేషం ఏమి లేదు. మీరు చేస్తున్న పనిని వేరే అవసరాలకు ఉపయోగిస్తున్న జగన్ తీరు మీదనే తన పోరాటం అని స్పష్టత ఇస్తూ అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Vangalapudi Anitha Pressmeet: అనకాపల్లి జిల్లా : తనపై సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్టు అవాస్తవ కథనాలు పోస్ట్ చేస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని నక్కపల్లి పోలీస్ స్టేషన్లో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీలో ఎమ్మెల్యేలకు వరుసగా నిరసన సెగలు ఎదురవుతున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారంను ప్రజలు అడ్డుకున్నారు. తమకు ఏమీ అవసరం లేదని తిప్పి పంపించారు. వివరాలు ఇలా..
Nellore Urban MLA Anil Kumar Yadav: నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బహిరంగ సభ నిర్వహించారు. తనను కోస్తే తన రక్తంలో కూడా సీఎం జగన్ ఉంటాడని స్పష్టం చేశారు.
Nellore Urban MLA Anil Kumar Yadav: నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ భవిష్యత్తుపై శుక్రవారం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బహిరంగ సభ నిర్వహించారు.
Rajampeta Politics in AP: కొత్తగా ఏర్పడిన జిల్లాకు కేంద్రం అవుతుందనుకున్న ఆ నియోజకవర్గానికి మొండి చేయి దక్కింది. అధికార పార్టీకి బలం ఉన్నా నేతల మధ్య అనైక్యత, వర్గ విభేదాలు అక్కడ వైసిపికి మైనస్ గా మారుతున్నాయి. జనంలో పార్టీని పలుచన చేసేలా అధికార పార్టీలోనే కొందరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వ్యవహరించడం సమస్యలను మరింత జఠిలం చేస్తోంది.
Pawan Kalyan Sensational Comments: జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతానని తెలిసే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానంటూ షాక్ ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.