/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Rajampeta Politics in AP: కొత్త‌గా ఏర్ప‌డిన జిల్లాకు కేంద్రం అవుతుంద‌నుకున్న ఆ నియోజ‌క‌వ‌ర్గానికి మొండి చేయి ద‌క్కింది. అధికార పార్టీకి బ‌లం ఉన్నా నేత‌ల మ‌ధ్య అనైక్య‌త‌, వ‌ర్గ విభేదాలు అక్క‌డ వైసిపికి మైన‌స్ గా మారుతున్నాయి. జ‌నంలో పార్టీని ప‌లుచ‌న చేసేలా అధికార పార్టీలోనే కొంద‌రు ఎమ్మెల్యేకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించడం స‌మ‌స్య‌లను మ‌రింత జ‌ఠిలం చేస్తోంది. వ‌చ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌కు బ‌దులు పెద్ది రెడ్డి ప్యామిలీ మ‌ద్దతు ఇస్తున్న వ్య‌క్తే బ‌రిలో ఉంటార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. మ‌ళ్ళీ టికెట్ నాకే అంటున్న మేడా ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా ? లేక పార్టీ కొత్త అభ్య‌ర్థికి చోటిస్తుందా ? చెకౌట్ దిస్ స్టోరీ...

జిల్లాల విభజన తర్వాత అన్న‌మ‌య్య జిల్లా రాజంపేటలో వైసిపీకి ఎదురుగాలి త‌గులుతోంది. కొత్త జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలంటూ ఎన్నో ర్యాలీలు, ధర్నాలు చేసినా రాజంపేట ప్రజల ఆకాంక్ష‌లు ఫలించలేదు. దీంతో రానున్న ఎన్నికల్లో వైసిపీకి ఎదురుగాలి తప్పదన్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది. అసలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజంపేట సెగ్మెంట్ ఎలా ఉండబోతుందీ... అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య పోటీలో వ‌చ్చి చేరే అంశాలేమిటి అన్న దానిపై ఉత్కంఠ‌త రేపుతోంది. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా నుంచి అన్న‌మ‌య్య జిల్లాగా వేరుపడ్డాక రాజంపేట సెగ్మెంట్‌లో రాజ‌కీయంగా కొత్త స‌మ‌స్య‌లు పుట్టుకొచ్చాయి.. దీంతో ఇక్క‌డి రాజ‌కీయం ర‌క‌ర‌కాల మ‌లుపులు తిరుగుతోంది. అధికార పార్టీలో వ‌ర్గాలు, అసంతృప్తులు, ప్ర‌తిప‌క్ష పార్టీ బ‌లం పుంజుకునే య‌త్నాలు వెర‌సి రాజంపేట రాజ‌కీయం వ‌చ్చే ఎన్నిక‌ల్లో భిన్నంగా ఉండ‌బోతుంద‌న్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి...

అన్నమయ్య జిల్లా రాజంపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి.  2014 లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన మేడా.. 2019ఎన్నిక‌ల నాటికి వైసీపీ గూటికి చేరారు...  త‌న చేతిలో ఓట‌మి పాలైన మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమ‌ర్‌నాథ్ రెడ్డితో కలిసి ప‌నిచేసేందుకు అడుగులు వేశారు. పార్టీ మారినా మేడాకే టికెట్ ఇచ్చింది వైసీపీ అధినాయకత్వం. అలాగే ఆకేపాటికి హామీ మేర‌కు ఉమ్మడి క‌డ‌ప జ‌డ్పీ ఛైర్మన్‌ ప‌ద‌విని క‌ట్టబెట్టింది. కానీ.. మేడా వైసీపీ ఎమ్మెల్యేగా గెలవ‌డంతోనే రాజంపేటలో ఆధిప‌త్య పోరుకు నాంది ప‌లికింది. ఇద్దరు నాయకులు పైకి సఖ్యతగానే కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం కత్తులు దూస్తున్నార‌ట‌. ప్రతి సందర్భంలోనూ ఇరు నేత‌ల మ‌ధ్య ఘర్షణ వాతావరణమే కనిపిస్తుండటంతో పార్టీ కేడర్‌లో  గందరగోళం పెరుగుతోంది.

రాజ‌ంపేటలో ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డికి వ్యతిరేకంగా  ఇటీవ‌ల‌ పోస్టర్లు వెలిశాయి. జ‌గ‌న‌న్నే మా న‌మ్మ‌కం అంటూ ప్ర‌భ‌త్వం కొత్త కార్య‌క్ర‌మం మొద‌లు పెడితే... జ‌గ‌న‌న్నే మా న‌మ్మ‌కం.. అయితే ఎమ్మెల్యే పై న‌మ్మ‌కం లేదంటూ కొంద‌రు అధికార పార్టికి చెందిన ఆకేపాటి అనుచ‌రులే పోస్ట‌ర్లు వేశారు.  దీనికి ముందు ఒంటిమిట్ట బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంలో సీఎంకు స్వాగ‌తం ప‌లుకుతూ మేడా పేరుతో వేసిన ప్లెక్సీల‌ను చించివేశారు.. ఈ సంఘ‌ట‌ల‌ను మ‌ర‌వ‌క ముందే  ఇటీవ‌ల  మేడా మ‌ల్లికార్జున రెడ్డి నియోజ‌క‌వ‌ర్గానికి చేసిందేమీ లేదంటూ ఊరు పేరు లేకుండా క‌ర‌పత్రాలు వేశారు. మేడా సొంత మండ‌లం నంద‌లూరుతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు ప్రాంతాల్లో ఈ క‌ర‌పత్రాల‌ను రోడ్ల‌పై విసిరేశారు.  ఇప్పుడు ఇదే  రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలో హాట్‌ టాపిక్ అయ్యింది.  పోస్టర్స్‌ వేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసినా, చూసీ చూడనట్టు పొమ్మని పార్టీనిలోని  కొంద‌రు పెద్ద‌ల నుంచి ఫోన్లు వెళ్ళాయట. ఇది ఖచ్చితంగా తన ప్రత్యర్థి వర్గం పనేనని నమ్ముతోంది ఎమ్మెల్యే  మేడా వర్గం.

ఇది కూడా చదవండి : APCID Notices: రామోజీరావు, శైలజా కిరణ్‌లకు మరోసారి నోటీసులు, జూలై 5 న సీఐడీ విచారణ

మేడా, ఆకేపాటి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న క్రమంలోనే ఎంపీ మిథున్‌రెడ్డి మేనల్లుడు గాలివీటి విజయసాగర్ రెడ్డి కూడా ఏడాది క్రితం రాజంపేట టిక్కెట్‌ రేసులోకి వచ్చారు. అప్పట్లో నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉన్నారాయన. ఆకేపాటి వర్గమంతా ఆయనకు మద్దతిస్తోందని ఒక దశలో బాగా ప్రచారం చేశారు.  నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌య సాగ‌ర్ రెడ్డి నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌ను మిధున్ రెడ్డి వ‌ర్గంతో పాటు, ఆకేపాటి వ‌ర్గం కూడా క‌లిసి తిరిగింది... మేడాకు వ్యతిరేకంగా నియోజ‌క‌ర్గంలో కొత్త వ‌ర్గాన్ని బ‌లోపేతం చేస్తున్నార‌న్న టాక్ న‌డుస్తోంది.   ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాను ఒంటరినయ్యానన్న ఫీలింగ్‌తో ఉన్నార‌ట రాజంపేట సిట్టింగ్  ఎమ్మెల్యే మేడా... అంతేకాక మేడా  పార్టీ మారతారన్న ప్రచారం కూడా  జోరుగా సాగుతోంది.  ఎన్నికలు సమీపిస్తున్న త‌రుణంలో  అధికార పార్టీలోని బ‌ల‌మైన ఇరు వర్గాల మధ్య రాజుకుంటున్న వివాదం ఏ టర్న్‌ తీసుకుంటుందో  అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.  ఈ  ప‌రిస్థితుల్లో నియోజ‌క‌వ‌ర్గంలోని వైసిపిలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు గంద‌ర‌గోళంలో ప‌డ్డారు. . పార్టీ పెద్దలు కొందరు ఆకేపాటికే మద్దతుగా ఉన్నారన్న ప్రచారం నడుమ మేడా మల్లిఖార్జున రెడ్డి ఎలా ముందుకు వెళతారన్నది ఆసక్తికరంగా మారింది.   రాజ‌కీయంగా నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీలో నెల‌కొన్న వ‌ర్గ విభేదాలు, ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకునే కార్య‌క్ర‌మాలు ఎన్నికల నాటికి సర్దుకుంటాయా... లేకుంటే  ఇంకా మితిమీరుతాయా అన్న‌ది.. వేచి చూడాలి.

ఇది కూడా చదవండి : Pawan Kalyan sensational Comments: వారాహి కోనసీమ యాత్రలో పవన్ సంచలన వ్యాఖ్యలు.. ఓడిపోతానని తెలిసే ఈ పోరాటం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Section: 
English Title: 
Rajampeta Politics in AP, Rajampeta Political war between ysrcp leaders may help tdp and janasena to win this seat
News Source: 
Home Title: 

Rajampeta Politics in AP: వైసిపీ నేతల కోల్డ్ వార్ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కలిసోస్తుందా ?

Rajampeta Politics in AP: వైసిపీ నేతల కోల్డ్ వార్ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కలిసోస్తుందా ?
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Rajampeta Politics: వైసిపీ నేతల కోల్డ్ వార్ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కలిసోస్తుందా ?
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, June 23, 2023 - 04:58
Request Count: 
27
Is Breaking News: 
No
Word Count: 
557