Kinjarapu Rammohan Naidu News: శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో వైసీపీకి కొరుకుడు పడని ఒకే ఒక ఏదైనా ఉందా అంటే అది అక్కడి లోక్ సభ సీటు అనే చెప్పుకోవచ్చు. పార్టీ పెట్టి పోటీ చేసిన రెండు ఎన్నికల్లోనూ వైసీపీకి ఈ సీటు అందని ద్రాక్షే అయింది. అదే విధంగా చూస్తే రెండు సార్లూ దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడే విజయపధంలో దూసుకెళ్లారు. ఆయన ఆ జిల్లా రాజకీయాల్లో యంగ్ లీడర్‌గా ఉన్నారు. పైగా సామాజిక వర్గం నుంచి తగినంత బలం, అండదండలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ పటిష్టంగా ఉంది. ఇవన్నీ రామ్మోహన్ నాయుడు విజయానికి దోహదపడుతున్నాయి. 2014 ఎన్నికల్లో సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం కుమార్తె రెడ్డి శాంతిని తెచ్చి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఆమె బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో విజయం దక్కుతుందని వైసీపీ అంచనా వేసింది. కానీ టీడీపీ వేవ్ పొత్తుల ఎత్తులతో మొత్తానికి మొత్తం శ్రీకాకుళం టీడీపీకి టర్న్ అయింది. అలా వైసీపీకి ఎంపీ సీటు చేజారిపోయింది.
2019లో పెద్ద ఎత్తున జగన్ వేవ్ కొనసాగింది. ఈ వేవ్‌లో శ్రీకాకుళం ఎంపీ సీటు గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ తలచింది. జిల్లాలో మరో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాళింగుల నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస్‌ని తీసుకొచ్చి లోక్ సభ ఎన్నికల్లో పోటీకి పెట్టారు. దువ్వాడ శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో రామ్మోహన్ మెజారిటీని ఎంతో కొంత తగ్గించగలిగారు కానీ గెలుపుని మాత్రం ఆపలేకపోయారు. ఇక ఇపుడు ముచ్చటగా మూడవసారి 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకాకుళం సీటుని వైసీపీ గెలుచుకోవాలని చూస్తోంది. దాంతో ఈసారి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్న సూత్రం మేరకు వెలమ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్‌కి వెలమల నుంచే ప్రత్యర్ధిని డిసైడ్ చేయాలని వైసీపీ అనుకుంటోందని టాక్. అందుకోసం రెవిన్యూ మంత్రిగా ఉన్న సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు వైపే వైసీపీ అధినాయకత్వం మొగ్గు చూపిస్తోందని అంటున్నారు.
అయితే ధర్మాన తనకు ఈ దఫాతో రాజకీయం ఇక చాలు అనేస్తున్నారు. తన కుమారుడు ధర్మాన రామ మనోహర్ నాయుడుకి శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్‌ని అడుగుతున్నారు. కానీ వైసీపీ మాత్రం ఎంపీగా మంత్రిని వెళ్లమంటోందని టాక్. అంతే కాదు శ్రీకాకుళం ఎంపీ సీటులో ఎవరు అభ్యర్ధి అన్నది మీ ముగ్గురూ నిర్ణయించుకోండి అని స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మాజీ మంత్రి నరసన్నపేట ఎమ్మెల్యే అయిన ధర్మాన క్రిష్ణదాస్‌లకు చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. దాంతో ఈ ముగ్గురూ మల్లగుల్లాలు పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఎంపీగా తన కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌కి టికెట్ ఇప్పించుకోవాలని తాను తిరిగి ఆముదాల వలస నుంచి పోటీ చేయాలని తమ్మినేని సీతారాం భావిస్తున్నారట. అయితే హై కమాండ్ దాన్ని ఎంతవరకూ ఆమోదిస్తుంది అన్నది తెలియడంలేదు. ఇక మంత్రి ధర్మాన అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం హై కమాండ్ సూచనలు మన్నించి శ్రీకాకుళం ఎంపీ క్యాండిడేట్‌గా నిలపాలని అనుకుంటున్నారు. అదే సమయంలో తాను అసెంబ్లీకి పోటీ చేయడానికి వీలు కల్పిస్తేనే ఇది సాధ్యం అని అంటున్నారు.
ఇది కూడా చదవండి : Gangadhara Nellore MLA Politics: గంగాధర నెల్లూరులో ఎమ్మెల్యేకు ఎదురుగాలి, ఈసారి టీడీపీ పరిస్థితేంటి ?
శ్రీకాకుళంలో మంత్రి తరఫున ఇప్పటికే చురుకుగా తిరుగుతూ రాజకీయంగా దూకుడు కొనసాగిస్తున్న మనోహర్ నాయుడు వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్ధి అయితే ఢీ అంటే ఢీ గా అక్కడి పొలిటికల్ ఫైట్ నడుస్తుంది అనే టాక్ అక్కడి రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఇద్దరూ యువకులే కావడంతో పాటు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కూడా కావడం, రాజకీయంగా బలమైన కుటుంబ చరిత్ర ఉండడంతో సిక్కోలు ఎంపీ పోరు రసవత్తరంగా ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
ఇది కూడా చదవండి : Who is YS Anil Reddy: వైయస్ కుటుంబం నుంచి మరో యువనేత.. ఎవరికి చెక్ పెట్టేందుకు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి