AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

AP Politics: ఏపీలో ఎన్నికల సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నేతల్ని కలిసే సెలెబ్రిటీలతో రాజకీయ ముఖచిత్రం మారవచ్చన్పిస్తోంది. తాజాగా మంచు మనోజ్ కుటుంబంతో చంద్రబాబుని కలవడం వెనుక రాజకీయం చాలానే ఉందన్పిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2023, 10:13 PM IST
AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

AP Politics: మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ భార్య, కుమారుడితో సహా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని కలిశారు. పైగా చంద్రబాబు ఆశీస్సుల కోసమే కలిసినట్టుగా ప్రకటించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కలయికతో మోహన్ బాబు కుటుంబం ఇప్పుుడు రాజకీయంగా కూడా రెండుగా చీలిపోయిందని అర్ధమౌతోంది. 

మోహన్ బాబు కుటుంబంలో విబేధాలు అందరికీ తెలిసినవే. సోదరులు మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య తీవ్ర విబేధాలు కొట్టుకునేంతవరకూ వెళ్లాయి. పరిస్థితి చేయి దాటడంతో మోహన్ బాబు ఇరువురికీ ఆస్థుల్ని కూడా పంచేశారు. సరిగ్గా ఇదే సమయంలో మనోజ్ దంపతులు చంద్రబాబుని కలవడం సినీరంగంలోనే కాదు..రాజకీయంగా కూడా చర్చనీయాంశమౌతోంది. చంద్రబాబుని మర్యాద పూర్వకంగా కలిశామని, ఆశీస్సులు తీసుకునేందుకే కలిశామని మనోజ్ దంపతులు చెప్పడం విశేషం. పెళ్లి తరువాత కలవాలని అనుకున్నా కుదరకపోవడంతో ఇప్పుడు కలిసినట్టుగా చెప్పుకొచ్చారు. అయితే అసలు సంకేతాలు వేరేగా ఉన్నాయని తెలుస్తోంది. 

మోహన్ బాబు వాస్తవానికి పూర్వాశ్రమంలో టీడీపీనే. రాజ్యసభ ఎంపీగా కూడా చేశారు. కానీ చంద్రబాబుతో దూరం పెరగడంతో వైసీపీలో చేరారు. అటు మంచు విష్ణుకు అయితే భార్య తరపు నుంచి ముఖ్యమంత్రి జగన్‌తో బంధుత్వముంది. దాంతో మోహన్ బాబు, మంచు విష్ణులు వైఎస్సార్సీపీకు మద్దతుగా కొనసాగుతున్నారు. మరోవైపు మంచు మనోజ్ పెళ్లి చేసుకున్న మౌనికా రెడ్డి మరెవరో కాదు..గతంలో వైసీపీలో ఉండి టీడీపీలో మారిన భూమా అఖిలప్రియ సోదరి. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల మరణానంతరం అఖిలప్రియ వైసీపీ నుంచి టీడీపీ తీర్ధం పుచ్చుకుంది. ఇప్పుుడు అఖిల ప్రియ సోదరి మౌనికా రెడ్డి, మంచు మనోజ్‌లు చంద్రబాబుని కలవడం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. 

మోహన్ బాబు కుటుంబం ఇప్పుడు రాజకీయంగా కూడా చీలిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. త్వరలో మంచు మనోజ్, మౌనికా రెడ్డిలు అధికారికంగా టీడీపీలో చేరవచ్చని సమాచారం. 

Also read: TSRTC Merger: టీఎస్సార్టీసీ ప్రభుత్వంలో విలీనం, తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News