AP Poll Strategy Survey: ఏపీలో అధికారం ఎవరిది, పోల్ స్ట్రాటజీ సర్వేలో సంచలన విషయాలు

AP Poll Strategy Survey: ఎన్నికలు సమీపించేకొద్దీ సర్వేల ప్రభావం పెరుగుతోంది. మొన్న టైమ్స్ నౌ భారత్ సర్వే తరువాత ఇప్పుడు మరో సంస్థ సర్వే సంచలనం రేపుతోంది. ఏపీలో ఈసారి అధికారం ఎవరిదో ఆ పార్టీ సంచలన సర్వే వెలువరించింది. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 13, 2023, 06:23 PM IST
AP Poll Strategy Survey: ఏపీలో అధికారం ఎవరిది, పోల్ స్ట్రాటజీ సర్వేలో సంచలన విషయాలు

AP Poll Strategy Survey: ఏపీలో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు ఏకమౌతున్నాయి. ఓ వైపు లోకేష్ పాదయాత్ర మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈలోగా మరో సర్వే సంచలన విషయాలు ప్రకటించింది. 

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ భారత్ సర్వేలో ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం సాధిస్తుందనే విషయాల్ని వెల్లడించింది. లోక్‌సభ స్థానాల్ని 24-25 గెల్చుకుంటుందని చెప్పడమే కాకుండా వైసీపీ ఓటు షేరు పెరిగిందని తేల్చింది. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసినా అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని తేల్చింది. ఇప్పుడు మరో సంస్థ సర్వే వెలువరించింది. ఈ సంస్థ సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైంది. ప్రతిపక్షాలు కలిసి కూటమిగా పోటీ చేసినా సరే విజయం వైసీపీదేనని తేల్చి చెప్పడంతో ప్రతిపక్షాలు ఫేక్ సర్వే అంటూ కొట్టిపారేస్తున్నాయి. ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ సర్వే చేసింది పోల్ స్ట్రాటజీ సంస్థ. ఓటు షేరింగ్, నాయకత్వ సామర్ధ్యం అంశాలపై ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 49 శాతం ఓటు షేర్ లభిస్తే టీడీపీ-జనసేన కూటమికి కిలిపి 41 శాతం ఓటు షేర్ దక్కింది. మరో పది శాతం ఇతరులకు వెళ్లనుంది. ఇక ముఖ్యమంత్రి అభ్యర్దిగా సమర్ధులెవరనే ప్రశ్నకు ఊహించని విధంగా వైఎస్ జగన్‌కు 56 శాతం మద్దతు లభించింది. చంద్రబాబుకు మాత్రం 37 శాతం ఓకే చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మాత్రం కేవలం 7 శాతమే లభించింది. ఇక మూడవ అంశం జగన్ ప్రభుత్వ పాలన బాగుందని 56 శాతం చెబితే 22 శాతం బాగాలేదన్నారు. 9 శాతం మంది చాలా బాగుందన్నారు. 8 శాతం మంది అస్సలు బాగాలేదని పెదవి విరిచారు. ఎటూ చెప్పలేనివాళ్లు 3 శాతం ఉన్నారు. 

ఆశ్చర్యకరమైన విషయమేమంటే 2019 కంటే కూడా వైసీపీ ఓటు షేరు పెరుగుతుందని పోల్ స్ట్రాటజీ సర్వే చెప్పింది. కేవలం సంక్షేమ పథకాల అమలుతోనే ప్రజలు జగన్ వైపు మొగ్గు చూపినట్టుగా సర్వేలో వెల్లడైంది. ప్రజలు కూడా అభివృద్ది కంటే సంక్షేమానికే పెద్దపీట వేసినట్టుగా అర్దమౌతోంది. చంద్రబాబు మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై ప్రజలు పెద్దగా ఆసక్తి కనబర్చలేదని సర్వే తెలిపింది. ఎందుకంటే గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోవడమే ఇందుకు కారణం. వైఎస్ జగన్ మాత్రం ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా సంక్షేమ పధకాలు అమలు చేసి చూపించడం ప్రజల్ని ఆకట్టుకుందని సర్వే వివరించింది.

పోల్ స్ట్రాటజీ సర్వే పలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మరోసారి బూస్ట్ ఇవ్వగా టీడీపీ నేతలు మాత్రం ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు.

Also read: Chandrayaan 3 Countdown: రేపే చంద్రయాన్ 3 ప్రయోగం, ప్రారంభమైన కౌంట్‌డౌన్, ప్రయోగం ఎలా జరుగుతుందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News