Araku bus accident news: అరకు : విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి అరకు ఘాట్‌రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
Ys jagan review: ఆంధ్రప్రదేశ్‌లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలపై ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యగా అమరావతి, విశాఖపట్నంలోని ప్రాజెక్టుల్ని త్వరగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలకు సొంతంగా ఇంటి స్థలం, సొంతింటి కల విషయమై..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లే అవుట్లను ప్రభుత్వమే అభివృద్ధి చేసి..లబ్దిదారులకు అందించనుంది.
ఏపీ మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారు. ఉగాది నాడు పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చాలని నిర్ణయించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శైలి ఎప్పుడూ ప్రత్యేకమే. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల్ని ప్రకటించి విస్మయపరిచారు. ఇప్పుడు అదే దిశగా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఇంతకీ జగన్ వ్యూహమేంటి..
వేసవి వచ్చిందంటే చాలు..విశాఖపట్నంలో తాగునీటి కోసం కటకటలాడే పరిస్థితి. ప్రతిపాదిత రాజధాని ప్రాంతం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గోదావరి నీటిని విశాఖకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
Visakhapatnam Steel Plant Fire Accident | విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టీల్‌ప్లాంట్ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టర్బైన్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
ship to Visakhapatnam sea coast | దాదాపు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీరాన్ని దాటడంతో ఏపీలో నిన్నటి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం కారణంగా తెన్నేటి పార్క్ తీరంలో ఓ నౌక ఒడ్డుకు కొట్టుకురావడం గమనార్హం.
ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు, ఆయన పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని Botsa Satyanarayana విమర్శించారు. ఫ్లాప్ అయిన సినిమాకు వంద రోజుల ఫంక్షన్, సక్సెట్ మీట్ ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు, టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Dronamraju Srinivas Dies | వీఎంఆర్డీఏ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ (59) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడి అనారోగ్యానికి గురయ్యారు. కరోనా నుంచి కోలుకున్నా.. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
COVID-19 vaccine clinical trials in Vizag విశాఖ: కొవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు ఆంధ్రా మెడికల్ కాలేజీ ( AMC ), కింగ్ జార్జ్ హాస్పిటల్స్ ( KGH )లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
fire accident at Vizag port | గత కొన్ని రోజులుగా ఏపీలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖ పోర్టు ట్రస్టులో అగ్ని ప్రమాదం సంభవించింది. వెస్ట్ క్యూ ఫైవ్ బెర్త్‌లో ఓ నౌక ఇంజిన్ నుంచి పోగలు వచ్చాయి.
మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ లభించినట్టే. రాజధాని ఎక్కడుండాలి, ఎక్కడ్నించి పరిపాలించాలనే విషయాన్ని నిర్ణయించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని...కేంద్రానికి సంబంధం లేదని స్పష్టమైంది. ఏపీ హైకోర్టులో సాక్షాత్తూ హైకోర్టు ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది.
Visakhapatnam crane tragedy వైజాగ్: విశాఖలో మరో విషాదం చోటుచేసుకుంది. హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్‌లో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో 10 మంది మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం క్రేన్‌ను రోజువారి విధులలో భాగంగా చెక్ చేస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలింది.
Tollywood celebrities | చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ( AP CM YS Jagan) కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఏపీ సర్కారు నుంచి సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాల గురించి చర్చించారు.
Ganja smuggling | విజయవాడ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి, గుట్కా వంటి వాటిని విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదంమోపిన విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. సోమవారం భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను (Ganja peddlers) పట్టుకున్నారు. గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాలతో పాటు గుట్కా అమ్మకాలను నియంత్రించడానికి విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు.
విశాఖపట్నం: పామును.. చూడగానే ఆమడ దూరం పరుగెడతాం. ఇది సహజం. మరి ఆ పాము చాలా పెద్దగా ఉంటే.. గుండెలు గుభేల్ మంటాయి. అలాంటి పామును చంపకుండా జాగ్రత్తగా అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది..?
ఎల్జీ పాలిమర్స్ కు ఏపీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. విశాఖ జిల్లాలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఇటీవలే స్టెరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో 11 మంది మరణించారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.