వామ్మో..!! ఎంత పెద్ద పాము..!!

విశాఖపట్నం: పామును.. చూడగానే ఆమడ దూరం పరుగెడతాం. ఇది సహజం. మరి ఆ పాము చాలా పెద్దగా ఉంటే.. గుండెలు గుభేల్ మంటాయి. అలాంటి పామును చంపకుండా జాగ్రత్తగా అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది..? 

Last Updated : May 26, 2020, 08:27 AM IST
వామ్మో..!! ఎంత పెద్ద పాము..!!

విశాఖపట్నం: పామును.. చూడగానే ఆమడ దూరం పరుగెడతాం. ఇది సహజం. మరి ఆ పాము చాలా పెద్దగా ఉంటే.. గుండెలు గుభేల్ మంటాయి. అలాంటి పామును చంపకుండా జాగ్రత్తగా అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది..? 

విశాఖపట్నం జిల్లా తమ్మాడపల్లి గ్రామంలో అతి పేద్ద పాము దర్శనమిచ్చింది. ఏకంగా 15  ఫీట్లు పొడవు ఉన్న పామును గ్రామస్తులు చూశారు. దీంతో భయాందోళనకు గురయ్యారు. ఎటువైపు దాడి చేస్తుందోనని ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..వారు అటవీ శాఖ సిబ్బందికి విషయం తెలియజేశారు. 

ఇంతలో అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న పాములు రక్షించే బృందం సాయం కూడా తీసుకున్నారు. చాలా జాగ్రత్తగా అతి పెద్ద పామును బంధించారు. ఆ పాము... అతి విషపూరితమైన కింగ్ కోబ్రా అని స్నేక్ రెస్క్యూ టీమ్ వెల్లడించింది. కాటు వేస్తే క్షణాల్లోనే ప్రాణాలు పోతాయని తెలిపింది. దాదాపు 15 ఫీట్ల పొడవున్న కింగ్ కోబ్రాను జాగ్రత్తగా బంధించి.. అటవీ ప్రాంతం వద్దకు తీసుకుని వెళ్లారు.

చెరుకుపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో దాన్ని జాగ్రత్తగా వదిలి పెట్టారు. దీంతో తమ్మాడపల్లి గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. స్నేక్ రెస్క్యూ టీమ్ తోపాటు అటవీ శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News