Chiranjeevi: సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున, ఇతర టాలీవుడ్ సెలబ్రిటీలు

Tollywood celebrities | చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ( AP CM YS Jagan) కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఏపీ సర్కారు నుంచి సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాల గురించి చర్చించారు.

Last Updated : Jun 9, 2020, 06:02 PM IST
Chiranjeevi: సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున, ఇతర టాలీవుడ్ సెలబ్రిటీలు

Tollywood celebrities | చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రాష్ట్ర చలన చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ విజయ్ చందర్, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ( AP CM YS Jagan) కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఏపీ సర్కారు నుంచి సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాల గురించి చర్చించారు. మంత్రి పేర్ని నాని, వైసిపి నేత ప్రముఖ సినీ నిర్మాత అయిన పొట్లూరి వర ప్రసాద్ (PVP) కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం క్యాంపు కార్యాలయం బయట చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంగా ముఖ్యమంత్రిని కలవాలని అనుకున్నాం కానీ అప్పుడు అది కుదరలేదు. ఇవాళ కుదిరింది అని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెప్పిన చిరంజీవి.. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన కారణంగా షూటింగ్స్ లేక ఇబ్బంది పడ్డామని, కానీ సీఎం జగన్ ఏపీలోనూ సినిమా షూటింగ్స్‌కి అనుమతి ( Film shootings) ఇచ్చారని తెలిపారు. థియేటర్ల సమస్యలు, మినిమం ఫిక్స్డ్ ఛార్జ్‌లు ఎత్తివేయాలని ముఖ్యమంత్రిని కోరాం. టికెట్స్ ధరల ఫ్లెక్సీ రేట్లపైనా దృష్టి పెట్టాల్సిందిగా కోరాం. మా వినతులన్నింటినీ పరిశీలిస్తాం అని ముఖ్యమంత్రి జగన్ బదులిచ్చినట్టుగా తెలిపారు.

నంది వేడుకలు పెండింగ్ ఉన్నాయి. అలాగే 2019-20 ఏడాదికి గాను అవార్డుల వేడుక కూడా జరుగుతుందని భావిస్తున్నాం. ప్రభుత్వం నుంచి మేము ప్రోత్సాహం కోరుకుంటున్నాం. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను వెన్నంటి ఉంటానని సీఎం జగన్ చెప్పడం మాకు ఆనందం కలిగించిందన్నారు చిరంజీవి. 

ఈ సందర్భంగా స్టూడియో స్థలాల కేటాయింపు గురించి చిరంజీవి మాట్లాడుతూ.. వైఎస్సార్ ఉన్నప్పుడే వైజాగ్‌లో స్టూడియోకి భూమి ( Film studios in Vizag) ఇచ్చారు. అందులోనే పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టంచేశారు.

Trending News