AP: మూడు రాజధానుల అంశంపై కేంద్రం వైఖరి ఇదే

మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ లభించినట్టే. రాజధాని ఎక్కడుండాలి, ఎక్కడ్నించి పరిపాలించాలనే విషయాన్ని నిర్ణయించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని...కేంద్రానికి సంబంధం లేదని స్పష్టమైంది. ఏపీ హైకోర్టులో సాక్షాత్తూ హైకోర్టు ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది.

Last Updated : Aug 6, 2020, 01:09 PM IST
AP: మూడు రాజధానుల అంశంపై కేంద్రం వైఖరి ఇదే

మూడు రాజధానుల ( 3 capital issue ) విషయంలో ఏపీ ప్రభుత్వానికి ( Ap government ) భారీ రిలీఫ్ లభించినట్టే. రాజధాని ఎక్కడుండాలి, ఎక్కడ్నించి పరిపాలించాలనే విషయాన్ని నిర్ణయించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని...కేంద్రానికి సంబంధం లేదని స్పష్టమైంది. ఏపీ హైకోర్టులో సాక్షాత్తూ హైకోర్టు ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) దేశంలోనే తొలిసారిగా మూడు రాజధానుల అంశాన్ని తెరపై తీసుకొచ్చారు. ఇటీవల ఈ అంశానికి గవర్నర్ సైతం ఆమోదం తెలిపారు. అయితే దీన్ని రాజకీయం చేస్తూ ప్రతిపక్షం తెలుగుదేశం ( TDP ) వ్యతిరేకిస్తోంది. మరోవైపు అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు కొంతమంది హైకోర్టు ( High court ) లో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వాదనతో పాటు కేంద్రం కూడా తన అభిప్రాయాన్ని చెప్పాలని కోర్టు సూచించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. 

కేంద్రం సమర్పించిన అఫిడవిట్ లో ఏముంది

రాజధాని ( Capital ) ఎక్కడ నిర్ణయించాలనే విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని కేంద్రం ( Central ) స్పష్టం చేసింది. గతంలో పార్లమెంట్ సాక్షిగా చెప్పిన విషయాన్నే మరోసారి ఏపీ హైకోర్టుకు అఫిడవిట్ ద్వారా వివరించింది. దీనిలో కేంద్రం పాత్ర ఉండదని, ఎక్కడ్నించి పరిపాలించాలనే విషయాన్ని తాము నిర్దేశించలేమని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనువైన ప్రాంతంలో గానీ, అభివృద్ది చేయాలని భావించిన ప్రాంతం నుంచి గానీ పరిపాలన చేయవచ్చని చెప్పింది. ఈ అంశంపై పూర్తి అధికారాలు రాష్ట్రాల్లోని ప్రభుత్వానిదేనని చెప్పింది. మరోవైపు హైకోర్టుకు కూడా స్పష్టమైన దిశానిర్దేశం చేసింది కేంద్ర ప్రభుత్వం. చట్టసభల్లో చర్చించిన అంశాలు కూడా న్యాయపరిధిలో రావని స్పష్టం చేసింది. అధికారంలో వచ్చాక ఏ ప్రభుత్వమైనా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని, పరిపాలనలో భాగంగా ఎదురైన పరిస్థితుల్ని బట్టి నిర్ణయాన్ని మార్చుకోవచ్చని కూడా కేంద్రం అభిప్రాయపడింది. Also read: Andhra Pradesh: హైకోర్టు నుంచి ప్రభుత్వానికి షాక్

బీజేపీ సానుకూలమేనా

ఏపీ మూడు రాజధానుల అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ( Bjp Government ) సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా పార్లమెంట్ ( on the floor of parliament ) సాక్షిగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. రాష్ట్రాల రాజధానుల అంశమనేది పూర్తిగా రాష్ట్రాల చేతుల్లోనే ఉందని చెప్పారు. ఇప్పుడు ఏపీ హైకోర్టులో ( Ap High court ) సమర్పించిన అఫిడవిట్ లో కూడా ఇదే చెప్పింది. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ( Bjp ap president somu veerraju ) సైతం తమకు ఈ విషయంతో సంబంధం లేదని చెబుతూ పరోక్షంగా మద్దతు తెలిపారు. 

సో..ఓవరాల్ గా మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ లభించినట్టైంది. ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థల్లో వచ్చినట్టుగానీ, ప్రతిపక్షం చెబుతున్నట్టు గానీ హైకోర్టు స్టే ఇవ్వలేదని..విచారణలో భాగంగా ఇచ్చిన సమయాన్నిబట్టి స్టేటస్ కో మాత్రమే ఇచ్చారనేది నిపుణులు చెబుతున్న మాట. Also read: AP: సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ పారంభం

Trending News