మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజంటే.. తెలగు ప్రేక్షకుల్లో ఎంత సందడి నెలకుంటుందో అందరికీ తెలిసిందే. ఈ రోజుతో మెగాస్టార్ 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మెగా పుట్టినరోజు ( Chiranjeevi birthday ) ను ఎక్కడెక్కోడో ఉన్న మెగా అభిమానులంతా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. . అయితే ఉదయం నుంచి చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ఏ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తారోనని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ( Chiranjeevi ) అంటే ఒక ప్రత్యేక అభిమానం.. స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. మెగాస్టార్గా ప్రేక్షకుల మనస్సులో గుడికట్టుకున్న గ్యాంగ్ లీడర్. ఆయన స్టెప్పేస్తే థియేటర్లన్నీ మారుమోగాల్సిందే.
శ్యామ్.కె.నాయుడు ( Shyam K Naidu ) తనను మోసం చేశాడంటూ సాయి సుధ ( Sai Sudha ) అనే సినీ ఆర్టిస్ట్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లుగా తనతో రిలేషన్షిప్ మెయింటెన్ చేసిన శ్యామ్ కే నాయుడు ఇప్పుడు పెళ్లి మాట దాటేస్తున్నాడని సాయి సుధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ( SR Nagar ) కేసు నమోదైంది.
సార్ట్ దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో జూ. ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే… మోస్ట్ ఎవైటింగ్ కాంబినేషన్ మూవీ గా తెరక్కెక్కుతున్న ఈ సినిమాకు హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు మేకర్స్.జనవరి లేదా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.అయితే ఇటివలే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్, మెహ్రీన్ పేర్లు వినిపించగా ఇప్పుడు ఈ సినిమాకు పూజ హెగ్డే ని హీరోయిన్ గా ఫైనల్ చేయనున్నారని తెలుస్తుంది.
నెక్ట్స్ నువ్వే.. ఈ ఒక్క సినిమా చుట్టూ చాలా బజ్ నడిచింది. బుల్లితెర స్టార్ ప్రభాకర్ దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంగా తీసిన సినిమా ఇది. హీరో ఆది సాయికుమార్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మూవీ ఇది. అటు ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వి-4 మూవీస్ బ్యానర్ తొలి చిత్రమిది. మరి ఇలా భారీ ఆశలు, భారీ అంచనాల మధ్య ఈరోజు థియేటర్లలోకి వచ్చిన “నెక్ట్స్ నువ్వే” ఎలా ఉంది..?
సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ రావిపూడి మల్టీస్టారర్ తో సినిమా తీసేందుకు ప్లాన్ చేసినట్లు టాక్. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోతో యంగ్ హీరో నటిస్తాడని తెలిసింది. అయితే ఏ ప్రాతలో ఎవరు నటిస్తారనే విషయంపై ఇంక్లా క్లారిటీ రాలేదు. ఇప్పటికే పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో అనిల్ రావిపూడి దర్శకుడిగా హ్యాట్రిక్ అందుకున్న విషయం తెలిసిందే. మంచి ఉపు మీదున్న ఈ డెరెక్టర్... ఏ హీరోలతో మల్టీ స్టారర్ చేస్తాడో చూడాలి.
ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిపై రాంగోపాల్ వర్మ ప్రసంశల జల్లు కురిపించాడు. యువ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు బాహుబలి లాంటివాడని..ఆయన చేరికతో కాంగ్రెస్ కు ఓట్ల వర్షం కుపిస్తుందని కొనియాడుతూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.