Ys Jagan Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఐ టీడీపీ పేరుతో తన కుటుంబంపై దుష్ప్రచారం చేసినప్పుడు ఏమయ్యారని నిలదీశారు. ఫేక్ ఐడీలతో తనతో పాటు తన చెల్లెలు, తల్లి గురించి బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయలేదా అని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో ప్రశ్నించిన నేరానికి అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టులు చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. రామ్‌గోపాల్ వర్మపై తప్పుడు కేసులు పెట్టారని, సెన్సార్ బోర్డు అనుమతితోనే వర్మ సినిమాలు రిలీజ్ చేశారనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. న్యాయం కోసం ప్రశ్నిస్తే దళితుడైన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై కేసులు పెట్టి 70 రోజులుగా జైళ్లో ఉంచారన్నారు. తన కుటుంబంలో తగాదాల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు రాజకీయంగా ఎదిగాక ఎప్పుడైనా తల్లిదండ్రుల్ని పిలిచి భోజనాలు పెట్టావా అని మండిపడ్డారు జగన్. తల్లిదండ్రులు చనిపోతే కొరివి పెట్టని చంద్రబాబు తన కుటుంబం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పెంచుతూ బాదుడే బాదుడు కార్యక్రమం నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలపై 18 వేల కోట్ల భారం మోపారని స్పష్టం చేశారు. ఇప్పుడు కొత్తగా గ్రామీణ రహదారులపై టోల్ వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. టోల్ వసూలునే సంపద సృష్టి అని చంద్రబాబు అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తమ హయాంలో రోడ్ల నిర్మాణం కోసం 43036 కోట్లు ఖర్చు చేస్తే తెలుగుదేశం ఐదేళ్ల హయాంలో 24792 కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. మరోవైపు అసైన్డ్ భూముల విషయంలో వైసీపీ ప్రభుత్వంపై అసెంబ్లీలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎంఆర్పీ ధరలకు మధ్యం విక్రయాలు జరగడం లేదని, మద్యం మాఫియా నడుస్తోందన్నారు.
వైసీపీ హయాంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని, 30 వేలమంది మహిళలు మాయమయ్యారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తే..అసెంబ్లీ మాత్రం 2019-24 మధ్య కాలంలో 46 మంది మహిళలు ట్రాఫికింగ్‌కు గురయ్యారని ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. 1వ తేదీన జీతాలిస్తామని చెప్పి ఇప్పుడు 3 వారాలైనా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేదన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు ఐఆర్, డీఏ కోసం ఎదురు చూస్తున్నారని, వాలంటీర్ల జీతాలు పెంచుతామని చెప్పి ఇప్పుడు మొత్తం వ్యవస్థనే తొలగించారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ పేరుతో హామిలిచ్చి ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు.
ఇదేంటని ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయడం చేస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమంగా అరెస్టు చేసి కోర్టులో కూడా హాజరుపర్చడం లేదన్నారు. చంద్రబాబుతో ఇప్పుుడు యుద్ధం చేస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Also read: Banana Remedies: రోజూ పరగడుపున అరటి పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.