Jithender Reddy: బాహుబలి నటుడితో విరించి వర్మ నుంచి ఆసక్తికర పొలిటికల్ థ్రిల్లర్ 'జితేందర్ రెడ్డి'.. మే 3న విడుదల..

Jithender Reddy: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిజ జీవిత గాథల నేపథ్యంలో వస్తోన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 'జితేందర్ రెడ్డి'. విరించి వర్మ దర్శకత్వం వహించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 30, 2024, 06:15 PM IST
Jithender Reddy: బాహుబలి నటుడితో విరించి వర్మ నుంచి ఆసక్తికర పొలిటికల్ థ్రిల్లర్ 'జితేందర్ రెడ్డి'..  మే 3న విడుదల..

Jithender Reddy: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో నేషనల్ లెవల్లో అందరి మెప్పు పొందిన నటుడు రాకేష్ వర్రే.
గతంలో ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ మూవీతో హీరో, నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మధ్యనే నిర్మాతగా ‘పేకమేడలు’ చిత్రం నిర్మిస్తున్నారు. మరోవైపు మంచి కథలు, కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని  ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. గతంలో రిలీజ్ చేసిన ప్రోమోకి, అస్సలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి అని ? అని హీరో పేస్ రెవీల్ చెయ్యకుండా విడుదల చేసిన పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. 2024 May 3న ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నట్టు ఈ సినిమా డైరెక్టర్ విరించి వర్మ మీడియాకు తెలిపారు.  ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ, ఈ సినిమా 1st లుక్ పోస్టర్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో ఎవరో చూపించకుండా విడుదల చేసిన పోస్టర్స్ ఆడియన్స్‌లో అంచనాలు పెరిగేలా చేసాయన్నారు.

రాకేష్ వర్రే ఫ్యామిలీ హీరో గా ఎవ్వరికీ చెప్పొద్దూ లాంటి లవ్ స్టొరీ చేసారు. ఇపుడు వెంటనే  ఇలాంటి ఒక యాక్షన్ డ్రామా చెయ్యడం చాలా గొప్ప విషయం. ఈ జితేందర్ రెడ్డి జగిత్యాలలో 1980లలో యదార్ధంగా జరిగిన కథ. రియల్ స్టొరీని బాగా తియ్యడానికి చాలా రీసెర్చ్ చేసాము. దాని కోసం నేను మా టీం వర్క్ ఔట్స్ చేసి, రెఫెరెన్సులు తీసుకున్నాము. పెద్ద వారి సలహాలు తీసుకుని చాలా జెన్యూన్ గా చేసిన చిత్రం ఇది.  మే 3న రిలీజ్ అయ్యే ఈ సినిమాతో ఆరోజుల్లో విలువలతో కూడిన ఈ పాత్ర... దాని చుట్టూ తిరిగే కథని ఈ తరం ఆడియన్స్‌కు అందించాలని  చేసే ప్రయత్నమే ఈ జితేందర్ రెడ్డి.

ముదుగంటి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..
ఉయ్యాలా జంపాలా, మజ్ను లాంటి ప్రేమకథా చిత్రాలను డైరెక్ట్ చేసిన విరించి వర్మ..  మా జితేందర్ రెడ్డి లాంటి హై ఓల్టేజ్ యాక్షన్ స్టొరీని కూడా అద్భుతంగా తెరకెక్కించారు. ఔట్‌పుట్ బాగా వచ్చింది. ఈ చిత్రం యొక్క పోస్టర్స్, గ్లిమ్స్ ను చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.   జితేందర్ రెడ్డి అనే టైటిల్‌తోనే ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. 1980లో నేను చూసిన, నాకు తెలిసిన కథ ఈ జితేందర్ రెడ్డి, అప్పటి లొకేషన్స్ గాని, అప్పటి అంబియన్స్ ని గాని చాలా చక్కగా తెరపై చూపించాము. మా హీరో రాకేష్ వర్రే గురించి మీకు చెప్పాలి, గతంలో లవ్ స్టొరీ చేసి ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా ని కూడా చాలా బాగా నటించాడు. తనకు సొంతగా క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ ఉంది. అయినా.. తన సినిమాలే మూడు సెట్స్ పైన ఉన్నా..  జితేందర్ రెడ్డిని తన సొంత ప్రాజెక్ట్ లాగా భావించి అంకిత భావంతో పనిచేసారు. తన సినిమాల పనులను అడ్జస్ట్ చేసుకుని చాలా శ్రమని ఈ సినిమా కోసం పెట్టారు. అప్పటి సన్నివేశాలని, జరిగిన కథని యదార్ధంగా తెరపై చూపించాము . అంతే తప్ప, ఎవరిని కించ పరిచే విధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదు. సుబ్బరాజు లాంటి విలక్షణ నటులు కూడా మనసు పెట్టి అధ్బుతంగా ఈ కథ కోసం పని చేశారు. ఈసినిమాకి సంబధించిన updatesను మీకు ఇకనుండి ఇస్తూ ఉంటాము. మేము మొదటి సారి సినిమా ఇండస్ట్రీ కి వచ్చి ఈ సినిమా చేస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ కోరారు.

కంచే, NTR కథానాయకుడు, NTR మహానాయకుడు, IB 47 విజువల్స్ అందిచిన వి.ఎస్‌ జ్ఞాన శేఖర్‌ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. అలాగే ఎన్నో లవ్ స్టోరీస్ కు మ్యూజికల్ హిట్స్ అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ జితేందర్ రెడ్డి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నాగేంద్రకుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

నటీ నటులు : రాకేష్ వర్రే, రియా సుమన్,
ఛత్రపతి శేఖర్,
సుబ్బరాజు, రవి ప్రకాష్,
ఛత్రపతి శేఖర్

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు : విరించి వర్మ.
నిర్మాత :  ముదుగంటి రవీందర్ రెడ్డి.
కో - నిర్మాత : ఉమ రవీందర్.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వాణిశ్రీ పొడుగు
డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ : వి. ఎస్. జ్ఞాన శేఖర్.
మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్.
ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్రకుమార్

Also read: YCP New Strategy: ప్రత్యర్ధి పార్టీల రెబెల్స్‌పై గురి పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News