Manjummel Boys: మలయాళంలో వసూళ్ల ప్రభంజనం కురిపిస్తోన్న 'మంజుమ్మేల్ బాయ్స్' మూవీ.. ఈ సినిమా స్టోరీ ఏమిటంటే.. ?

Manjummel Boys: ఈ మధ్యకాలంలో మలయాళంలో చిన్న చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి.అప్పట్లో ప్రేమమ్ మూవీ అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మోహన్‌లాల్ 'మన్యంపులి'.. తాజాగా 'ప్రేమలు' సినిమా ఘన విజయం సాధించాయి. తాజాగా ఈ కోవలో మల్లూవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న మరో మూవీ 'మంజుమ్మేల్ బాయ్స్'.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 29, 2024, 09:19 AM IST
Manjummel Boys: మలయాళంలో వసూళ్ల ప్రభంజనం కురిపిస్తోన్న 'మంజుమ్మేల్ బాయ్స్' మూవీ.. ఈ సినిమా స్టోరీ ఏమిటంటే.. ?

Manjummel Boys: మలయాళ బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగులో రీమేక్ కావడంతో పాటు అక్కడి సినిమాలు చాలా తెలుగులో డబ్బై మంచి విజయం సాధించిన సందర్బాలున్నాయి. కానీ మధ్యకాలంలో మలయాళ సినీ ఇండస్ట్రీలో అన్‌సీజన్‌లో విడుదలై కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కోవలో రీసెంట్‌గా మలయాళంలో 'లవ్ స్టోరీస్' సినిమాను తెలుగులో 'ప్రేమలు' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇక్కడి ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయింది. అంతేకాదు తెలుగులో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ కోవలో మలయాళంలో హిట్టైన మరో మూవీ 'మంజుమ్మేల్ బాయ్స్'. మలయాళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాకుండా.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇపుడు ఈ సినిమా ఏప్రిల్ 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా ఫిబ్రవరిలో మలయాళంలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాదు మలయాళ భాషలోనే రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. మంజుమ్మేల్ అనే పట్టాణానికి కొంత మంది స్నేహితులు..కొడైకెనాల్‌కు ట్రిప్ ప్లాన్ చేస్తారు. అక్కడ నిషేధం విధించిన ఓ గుహలో ప్రవేశిస్తారు. ఆ గుహలో పడిపోయిన ఓ స్నేహితుడిని రక్షించడానికి మిగిలిన ఫ్రెండ్స్ ఎలాంటి ప్రయత్నాలు చేసారనేది ఎంతో థ్రిల్లింగ్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.

సౌభిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్.పొదువాల్, లాల్ జూనియర్, దిపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖలీద్ రెహమాన్, చందూ సలీంకుమార్ ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్,ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కలిసి విడుదల చేస్తున్నారు. ౮మంజుమ్మేల్ బాయ్స్' సినిమాను ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను చిదంబరం దర్శకత్వం వహించారు. మరి మలయాళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Also Read:  Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్‌..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News