Racharikam Movie review: గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఢిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన చిత్రం ‘రాచరికం’. విజయ్ శంకర్ హీరోగా వరుణ్ సందేశ్ విలన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో మూవీ రివ్యూలో చూద్దాం.
Venkatesh: హీరో వెంకటేష్ మరో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. సౌత్ సీనియర్ హీరోల్లో 60 ప్లస్ ఏజ్ లో చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ క్రియేట్ చేసిన రికార్డును వెంకటేష్ కూడా అందుకున్నాడు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకీ మామ ఈ రికార్డ్ క్రియేట్ చేసారు.
Sankranthiki Vasthunnam Box Office Collections Records: సంక్రాంతి సినిమాల్లో అతి తక్కువ ఎక్స్ పెక్టేషన్స్ తో అతి తక్కువ బడ్జెట్ తో అతి తక్కువ టైమ్ లో అతి తక్కువ ప్రీ రిలీజ్ చేసిన సినిమా ‘సంక్రాంతి వస్తున్నాం’. కానీ ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఇపుడు ఈ సినిమా పలు రికార్డులను పాతరేసింది.
Tamannaah: తమన్నా.. స్వతహాగా నార్త్ భామ అయినా.. సౌత్ హీరోయిన్ గా దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించింది. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట సత్తా చాటుతోంది తమన్నా. హీరోయిన్గా 20 యేళ్లు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ఆడియన్స్ ను మెప్పిస్తోంది. హీరోయిన్ గా నటిస్తూనే అవసరమైనపుడు గ్లామర్ ఒలకబోస్తూనే ఉంది.
Agent Guy 001: ఒక భాషలో హిట్టైన చిత్రాలను వేరే లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హాలీవుడ్ లో తెరకెక్కిన ‘ఏజెంట్ 001’ చిత్రాన్ని తెలుగులో జనవరి 31న దీప ఆర్ట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో అజాత శత్రువు. అన్ని పార్టీల్లో ఆయనను అభిమానించేవారున్నారు. తాజాగా ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎక్స్ పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో కలిసారు.
Jatadhara: సుధీర్ బాబు తెలుగులో ఒక రకమైన పాత్రలకే ఫిక్స్ కాకుండా వెరైటీ కాన్సెస్ట్ చిత్రాలతో ఆడియన్స్ ను పలకరిస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు ‘జటాధర’ మూవీ చేస్తున్నాడు. శివతత్త్వంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నిర్మాణంలో జీ స్టూడియోస్ భాగస్వామిగా మారింది.
Constable Title Song: వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘కానిస్టేబుల్’. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి తెలుగు పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ విడుదల చేశారు.
LYF Teaser Launch: తెలుగు చిత్ర పరిశ్రమలో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలిపే చిత్రాలు ఎన్నో తెరకెక్కాయి. ఈ రూట్లోనే వచ్చిన మరో మూవీ ‘లవ్ యువర్ ఫాదర్’ (LYF). మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నప రెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ. రామస్వామి రెడ్డి నిర్మించారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు.
Nuvve Kavali Song: మహబూబ్ దిల్ సే, శ్రీ సత్య కలిసి చేసిన యూత్ ఫుల్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ 'నువ్వే కావాలి' లాంచ్ ఘనంగా జరిగింది. ఈ పాటకి సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించారు. భార్గవ్ రవడ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించారు. ఈ పాటకు మనీష్ కుమార్ సంగీతం అందించి ఆలపించగా, వైషు మాయతో కలిసి పాడిన ఈ యుగళ గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
My South Diva Calender 2025 Launch: ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ నేతృత్వంలో ప్రతిష్టాత్మక మై సౌత్ దివా క్యాలెండర్ 2025 లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. హీరోయిన్స్ శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ, తాన్య హోప్, ఐశ్వర్య కృష్ణ, కుషిత కొల్లాపు, వినాలీ భట్నాగర్, రియా సచ్ దేవ్, కనిక మాన్, పలక్ అగర్వాల్ తో కూడిన ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
Dil Raju Opens Mouth On Four Days IT Raids: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేపిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలపై తొలిసారి నిర్మాత దిల్ రాజు నోరు విప్పారు. తన నివాసం, కార్యాలయాలపై జరిగిన దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Dear Krishna Movie Review: గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సహా ఇతర చిత్ర పరిశ్రమల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రాలను ఆడియన్స్ ఆదిస్తున్నారు. ఈ కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో డిఫరెంట్ మూవీ ‘డియర్ కృష్ణ’. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Sankranthiki Vasthunnam Box Office Collections: చిన్న చిన్న చినుకులే తుపానుగా మారినట్టు.. సంక్రాంతి సినిమాల్లో తక్కువ బడ్జెట్ తో తక్కువ టైమ్ లో తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ తో సంక్రాంతి సీజన్ లో లాస్ట్ లో విడుదలైన వెంకటేష్ ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా ఒక్కో రికార్డు తుక్కు ఒదలగొడుతుంది. అంతేకాదు పలు రికార్డులను తన పేరిట రాసుకుంటోంది.
Fun Emoji:‘ఫన్ మోజీ’ అంటూ యూట్యూబ్‌లో అందరినీ ఎంటర్టైన్ చేసే టీం ఇకపై మూవీలతో ఆడియన్స్ ను మెప్పించేందుకు రెడీ అయింది. మన్వంతర మోషన్ పిక్ఛర్స్ మీద కొత్త ప్రాజెక్టులను ప్రారంభించబోతోన్నారు.దానికి సంబంధించిన ప్రకటన చేశారు.
Hathya Movie Review: టాలీవుడ్ సహా అన్ని భాషల్లో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలను సరైన విధంగా తెరకెక్కిస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పక ఉంటుంది. ఈ రూట్లో వచ్చిన మరో సైకాలాజిక్ థ్రిల్లర్ మూవీ ‘హత్య’. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Actor Venkatesh Reacts On IT Raids Dil Raju And Others: ఐటీ దాడులతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. సంక్రాంతికి విడుదలైన సినిమాలనే టార్గెట్ చేయడంతో పరిశ్రమలో కలకలం రేపుతుండగా ఈ దాడులపై విక్టరీ వెంకటేశ్‌తోపాటు దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు.
Gandhi Thatha Chettu Movie Review: టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి లీడ్ రోల్ల్ యాక్ట్ చేసిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. విడుదలకు ముందే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమాను ప్రదర్శిస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందు విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా ఈ నెల 24న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Prasanth Varma Brahma Rakshasa: బ్రహ్మ రాక్షస సినిమా నుంచి రణవీర్ సింగ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఫైనల్ గా తెలుగు హీరో రానా ఫిక్సయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం రానా అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. రానా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి ఒప్పుకోవడం ఆసక్తికరంగా మారింది.
Second Day IT Raids In Dil Raju House: సంక్రాంతి పండుగకు మూడు సినిమాలు విడుదల చేసి సంచలనం రేపిన దిల్ రాజుకు భారీ షాక్ తగిలింది. వరుసగా రెండో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో భారీగా నోట్ల కట్టలు కనిపించాయనే వార్త సంచలనం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.