Hello Baby - Naveen Chandra: నవీన్ చంద్ర లాంఛ్ చేసిన 'హలో బేబి' ప్రమోషనల్ సాంగ్..

Hello Baby - Naveen Chandra:నవీన్ చంద్ర యాక్టర్‌గా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాడు ఓటీటీ స్టార్‌గా దూసుకుపోతున్నాడు. ఇపుడు ఓటీటీ వేదికగా తెరకెక్కుతోన్న పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఈయన హలో బేబి మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 28, 2024, 02:30 PM IST
Hello Baby - Naveen Chandra: నవీన్ చంద్ర లాంఛ్ చేసిన 'హలో బేబి' ప్రమోషనల్ సాంగ్..

Hello Baby - Naveen Chandra:ఎస్ కె యల్ ఎమ్ పిక్చర్స్ బ్యానర్ పై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మించిన చిత్రం 'హలో బేబి'. రాంగోపాల్ రత్నం దర్శకత్వం వహించారు.  కావ్య కీర్తి నటించిన హలో బేబీ చిత్రం ప్రమోషనల్  సాంగ్ ను హీరో నవీన్ చంద్ర విడుదల చేశారు. హాల్లో బాయ్స్ లెట్స్ డు పార్టీ అని మొదలుపెట్టిన ఈ పాటను సింగర్ సాయి చరణ్ అద్భుతంగా పాడారు ఈ పాటను రాజేష్ లోక్‌నాథం రాశారు. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ సోలో క్యారెక్టర్ లో భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ చిత్రం కి ఆల్ ద బెస్ట్. ఇలాంటి చిత్రాలు చేయడానికి నిజంగా గట్స్ ఉండాలి. అలాంటి సాహసం చేసిన నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ కు దర్శకుడు రామ్ గోపాల్ రత్నంకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను.

నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ 'హలో బేబి' మూవీ  సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం కాబోతుంది. ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ చిత్రం చూసి అద్భుతంగా ఉండటంతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మెచ్చుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ పాట కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే. దీని కొరియోగ్రాఫర్ గా మహేష్ చాలా అద్భుతంగా ఈ పాట తీర్చి దిద్దారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సుకుమార్ పమ్మి ,ఎడిటర్ సాయిరాం తాటిపల్లి. ఈ చిత్రం ఒకే ఒక క్యారెక్టర్ తో కావ్య కీర్తి నటనతో త్వరలో ప్రేక్షకుల దగ్గరికి రాబోతుంది. కొత్త ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటునన్నారు.

Also Read: Pawan Kalyan: జనసేనకు పవన్‌ కల్యాణ్‌ భారీ విరాళం.. ఇకపై ఏపీలో రణరంగమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News